మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం మరో 39 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బీజేపీ ప్రకటించింది. గతంలో ఓడిపోయిన 39 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలIMadhya Pradesh Assembly Elections) కోసం మరో 39 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బీజేపీ(BJP) ప్రకటించింది. గతంలో ఓడిపోయిన 39 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ రెండో జాబితాలో ముగ్గురు కేంద్రమంత్రులతో పాటు పలువురు ఎంపీలకు టిక్కెట్లు లభించాయి. అందులో నరేంద్ర సింగ్ తోమర్(Narendra Singh Thomar), ఫగ్గన్ సింగ్ కులస్తే, ప్రహ్లాద్ సింగ్ పటేల్ పేర్లు ఉన్నాయి.
బీజేపీ జాబితా ప్రకారం.. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ దిమానీ నుంచి, కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే నివాస్ నుంచి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ నర్సింగపూర్ నుంచి, కైలాష్ విజయవర్గియా ఇండోర్-1 నుంచి పోటీ చేయనున్నారు. దీంతో పాటు పార్టీ ఎంపీలు రాకేష్ సింగ్ జబల్‌పూర్ వెస్ట్ నుంచి, గణేష్ సింగ్ సత్నా నుంచి, రీతీ పాఠక్ సిద్ధి నుంచి, ఉదయ్ ప్రతాప్ సింగ్ గదర్వారా నుంచి పోటీ చేయనున్నారు.
అంతకుముందు ఆగస్టు 17న బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అదే రోజు మధ్యప్రదేశ్‌తోపాటు ఛత్తీస్‌గఢ్‌కు కూడా అభ్యర్థులను ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో 39, ఛత్తీస్‌గఢ్‌లో 21 స్థానాలకు అభ్యర్ధులను బీజేపీ ప్రకటించింది.