ఓ దొంగ(Thief) ఒకే రోజు ఐదు షాపుల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. కానీ తనకు తమలపాకులను తినాలన్న ఆశ కల్గింది. దీంతో ఓ పాన్ డబ్బాను టార్గెట్ చేశాడు. అందులోని తమలపాకులు, సిగరెట్ డబ్బాలను ఎత్తుకెళ్లాడు. సముద్రాలన్నీ ఈది.. ఇంటెనుక గుంతలో పడి చచ్చినట్లు.. పెద్దపెద్ద దొంగతనాలను చేసిన ఈ దొంగ తమలపాకులు దొంగతనం చేసి దొరికిపోయాడు. దీంతో తన నేరాల చిట్టా అంతా బయటపడి. మధ్యప్రదేశ్‌లోని(Madhya Pardesh) గునాలో ఈ వ్యహారం బయటపడింది.

మధ్యప్రదేశ్‌లోని గునాకు చెందిన ధరతసింగ్ అనే వ్యక్తి దొంగతనాల బాటపట్టాడు. ఎవరికీ చిక్కకుండా చాకచక్యంగా దొంగతనాలు(Robbery) చేస్తూ పోలీసులు, స్థానికులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ మధ్యనే ఓ రోజు రాత్రి ఇదే ప్రాంతంలోని ఓ డెయిరీ సంస్థలో చోరీలకు పాల్పడ్డాడు. అందులోని నూనె డబ్బాలు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్‌లను ఎత్తుకెళ్లాడు. అంతేకాకుండా అదే రోజు రాత్రి మొత్తం ఐదుకి పైగా షాపుల్లో పలు వస్తువులను దొంగతనం చేశాడు. దోచిందానితో సరిపెట్టుకోకుండా ఇంటికి వెళ్లే సమయంలో మన దొంగకు తమలపాకులు(Mango leaves) తినాలన్న ఆశపుట్టింది. అందుకు ఓ పాన్ డబ్బాను టార్గెట్ చేశాడు. పాన్ డబ్బాలో ఉన్న 28 తమలపాలకుల కట్టలను తీసుకొని తన బ్యాగ్‌లో వేసుకున్నాడు. అందులో ఉన్న సిగరెట్ ప్యాకెట్లను కూడా చోరీ చేశాడు. తర్వాత రోజు ఉదయం పాన్ డబ్బాలో చోరీ జరిగిందన్న విషయం తెలుసుకున్న దాని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాన్‌డబ్బా పరిసరాలను పోలీసులు పరిశీలించారు. చుట్టుపక్కలో ఉన్న సీసీ కెమెరాల్లోని ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. దీంతో నిందితుడు ధరమ్‌సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇంకేముందు మనోడు చేసిన నేరాలు, చోరీలన్నీ బయటపడ్డాయి. ధరంసింగ్ తెలివిగా నేరాలకు పాల్పడడం చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. నిందితుడు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత లెక్కలన్నీ పోలీసులు తేల్చుతున్నారు.