పార్లమెంట్(parliament) నూతన భవంతి ప్రారంభోత్సవం మొదటి రోజునే అక్కడ ప్రతిష్టించిన చారిత్రాత్మక సెంగోల్ ఒరిగిపోయిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్(M.K.Stalin) అన్నారు. చారిత్రాత్మక సెంగోల్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా నరేంద్రమోదీ(Narendra Modi) భజనపరులను లక్ష్యంగా చేసుకుని మాటల దాడి చేశారు స్టాలిన్.
పార్లమెంట్(parliament) నూతన భవంతి ప్రారంభోత్సవం మొదటి రోజునే అక్కడ ప్రతిష్టించిన చారిత్రాత్మక సెంగోల్ ఒరిగిపోయిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్(M.K.Stalin) అన్నారు. చారిత్రాత్మక సెంగోల్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా నరేంద్రమోదీ(Narendra Modi) భజనపరులను లక్ష్యంగా చేసుకుని మాటల దాడి చేశారు స్టాలిన్. సరిగ్గా ప్రారంభోత్సవం రోజునే ధర్మానికి ప్రతీక, మన చారిత్రక సంప్రదాయం అపహాస్యం పాలైందంటూ స్టాలిన్ విమర్శించారు.
భారత రెజ్లర్లు(Wrestlers) ఢిల్లీలోని జంతర్‌మంతర్(Jantar Mantar) దగ్గర ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే! రోజుల తరబడి ఆందోళన చేసినా, నిరసనలు చేపట్టినా కేంద్రానికి చీమ కుట్టినట్టు అయినా లేకపోవడంతో భారత రెజ్లర్లు పార్లమెంట్ కొత్త భవనం వెలుపల నిరసన చేసేందుకు ప్రయత్నించడంతో ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ భారతీయ జనతాపార్టీపై(BJP) తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని మహిళా రెజ్లర్లు కొన్ని నెలలుగా నిరసనలు చేస్తున్నా మోదీ షాలకు పట్టింపులేదు. బ్రిజ్ భూషణ్‌పై(Brij Bushan) చర్యలు తీసుకోవడానికి మనసు రావడం లేదు. పైగా శాంతియుతంగా పార్లమెంట్ కొత్త భవనం వెలుపల నిరసన చేసేందుకు వచ్చిన రెజ్లర్లను ఈడ్చుకెళ్తూ వారిని అదుపులోకి తీసుకెళ్లడం అన్నది తీవ్రంగా ఖండించదగినదని స్టాలిన్ అన్నారు.
న్యాయం ఇక్కడ జరగదని తెలుసుకునే ధర్మానికి ప్రతీక అయిన సెంగోల్ మొదటి రోజే వంగినట్టు కనిపించిందని స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రపతి ముర్మును పక్కన పెట్టి, ప్రతిపక్షాల బహిష్కరణ మధ్య పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం రోజున ఇలాంటి దుర్మార్గమైన దారుణాలు జరగడం న్యాయమేనా అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రశ్నించారు