హర్యానాలోని(Haryana) గురుగ్రామ్‌లో(Gurugram) ఓ దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. పోర్‌షె లగ్జరీ స్పోర్ట్స్ కారు(Sport car) చెట్టును(tree) ఢీ కొట్టింది. ఆ దెబ్బకు నిమిషాల్లోనే కాలి బూడిదయ్యింది.
హర్యానాలోని(Haryana) గురుగ్రామ్‌లో(Gurugram) ఓ దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. పోర్‌షె లగ్జరీ స్పోర్ట్స్ కారు(Sport car) చెట్టును(tree) ఢీ కొట్టింది. ఆ దెబ్బకు నిమిషాల్లోనే కాలి బూడిదయ్యింది. ఆ కారు విలువ ఎంత కాదనుకున్నా రెండు కోట్ల(2 crore) రూపాయలకు పైనేఉంటుంది.మన్‌కీరత్ సింగ్(Mankeerat Singh) అనే 35 ఏళ్ల వ్యక్తి గురువారం తెల్లవారుజామున కారులో వెళుతున్నప్పుడు ఎదురుగా కుక్క అడ్డం వచ్చింది. కుక్కను తప్పించబోయే క్రమంలో కారుపై కంట్రోల్ కోల్పోయాడు మన్‌కీరత్ సింగ్. ఆ కారు వేగంగా రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. కారు భాగాలు వంద మీటర్ల దూరం వరకు వెళ్లి పడ్డాయి. ఒక్కసారిగా ఇంజిన్‌లోంచి మంటలు వచ్చాయి. ప్రమాదాన్ని పసికట్టిన మన్‌కీరత్ ఎలాగోలా కారు నుంచి బయటపడ్డాడు. కారు మాత్రం అగ్నికి ఆహుతయ్యింది. మన్‌కీరత్ గోల్ఫ్ కోర్స్ రోడ్డులోని సెక్టార్ 56 నుంచి సికందేర్‌పూర్ వెళుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది.