దాదాపు 30 సంవత్సరాల కింద దేశంలో తొలిసారి ఐవీఎఫ్‌(IVF) చికిత్సతో ఓ బిడ్డ(Baby) జన్మించాడు. చెంబూర్‌కు(Chembur) చెందిన దంపతులకు ఐవీఎఫ్‌ ద్వారా చికిత్స చేసి తొలిసారిగా లూవ్‌సింగ్‌కు(Luvsingh) జన్మనిచ్చారు. ఈరోజు అదే లూవ్‌సింగ్‌ మరో బిడ్డకు జన్మనిచ్చాడు.

దాదాపు 30 సంవత్సరాల కింద దేశంలో తొలిసారి ఐవీఎఫ్‌(IVF) చికిత్సతో ఓ బిడ్డ(Baby) జన్మించాడు. చెంబూర్‌కు(Chembur) చెందిన దంపతులకు ఐవీఎఫ్‌ ద్వారా చికిత్స చేసి తొలిసారిగా లూవ్‌సింగ్‌కు(Luvsingh) జన్మనిచ్చారు. ఈరోజు అదే లూవ్‌సింగ్‌ మరో బిడ్డకు జన్మనిచ్చాడు. న్యాయవాది(Lawyer) వృత్తిలో ఉన్న లూవ్ సింగ్‌కు ముంబై పెద్దర్ రోడ్‌లోని జస్లోక్ హాస్పిటల్‌లో కొడుకు పుట్టాడు. లూవ్‌సింగ్‌ తల్లిదండ్రులకు ఐవీఎఫ్‌ చికిత్స చేసిన వైద్యురాలే ఈ దంపతులకు కూడా ట్రీట్మెంట్‌ ఇవ్వడం గమనార్హం. లూవ్‌సింగ్‌ భార్య హార్లీన్(Harleen) సహజంగానే గర్భం దాల్చినప్పటికీ తాను పుట్టినప్పుడు చికిత్స చేసిన డాక్టర్‌ ఫిరూజా పారిఖ్(Firuza Parikh) దగ్గరికే తన భార్యను తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దీంతో జస్లోక్‌ ఆస్పత్రిలో లూవ్‌సింగ్‌ భార్య ప్రసవించింది.

30 ఏళ్ల కింద భారతదేశపు మొట్టమొదటి ICSI-ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ లూవ్‌ సింగ్‌ జన్మించాడు. ఈ సందర్భంగా డాక్టర్‌ పారిఖ్‌ మాట్లాడుతూ లువ్‌ సింగ్‌ భార్య హార్లిన్‌కు చికిత్స అందించాలని తనే కోరుకున్నారని చెప్పారు. హార్లిన్‌కు సహజంగానే గర్భం వచ్చిందని.. కానీ తనతోనే ట్రీట్మెంట్‌ వారు కోరుకున్నారని ఆమె వివరించారు. లువ్‌సింగ్‌ కుటుంబం తనను వారి కుటుంబంలో ఒకరిలా భావించారని ఆమె తెలిపింది. లువ్‌సింగ్‌ పుట్టినరోజు వేడుకలకు డాక్టర్ వెళ్లడమే కాకుండా 2019లో లువ్‌సింగ్‌ వివాహానికి కూడా డాక్టర్‌ పారిఖ్‌ హాజరయ్యారు.

1989లో డాక్టర్ పారిఖ్ యేల్ యూనివర్శిటీ నుంచి తిరిగి వచ్చినప్పుడు మైక్రోమానిప్యులేషన్ అనే ప్రయోగాత్మక సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఆమె ICSI పరికరాలను కొనుగోలు చేశారు. "ఫలదీకరణాన్ని సులభతరం చేయడానికి శాస్త్రవేత్తలు అప్పుడు గుడ్డు లోపలికి స్పెర్మ్‌ను ఇంజెక్ట్ చేయడానికి చాలా కష్టపడేవారని తెలిపింది. అప్పటి నుంచి అనేక అడ్డంకులను అధిగమించాం. తలసేమియా, నిర్దిష్ట క్యాన్సర్, డుచెన్ కండరాల బలహీనత, హంటింగ్‌టన్ వంటి ప్రాణాంతక వ్యాధులకు సంబంధించిన ఉత్పరివర్తనాలను కలిగి ఉన్న పిండాలను గుర్తించడానికి ప్రీ-ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నసిస్‌ను ఉపయోగించామని డాక్టర్‌ వివరించారు.

ఇక ఈ సందర్భంగా లువ్‌ తన తండ్రి 30 ఏళ్ల క్రితం జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. సంతానం లేకుండా ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగామని ఆ సమయంలో డాక్టర్‌ పారిఖ్‌ దేవతలా వచ్చి తమ కుటుంబంలో సంతోషాన్ని పంచారని ఆయన డాక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు కూడా లువ్‌ తండ్రి అయ్యేందుకు డాక్టర్‌ పారిఖ్ కారణమయ్యారని.. లువ్‌కు బిడ్డ పుట్టడంతో మా కుటుంబంలో మరోసారి పండగ వాతావరణ ఏర్పడిందని ఆయన తెలిపారు.

Updated On 2 Feb 2024 5:44 AM GMT
Ehatv

Ehatv

Next Story