ఐ ఫోన్‌(I Phone) కోసం డెలివరీ ఏజెంట్‌(Delivery Agent) ప్రాణం తీశాడో దుర్మార్గుడు.

ఐ ఫోన్‌(I Phone) కోసం డెలివరీ ఏజెంట్‌(Delivery Agent) ప్రాణం తీశాడో దుర్మార్గుడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) లక్నోలో(Lucknow) జరిగింది. నగరంలోని చిన్‌హాట్‌ ప్రాంతానికి చెందిన గజానన్‌ అనే వ్యక్తి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా 1.5 లక్షల రూపాయల విలువైన ఐ ఫోన్‌ను ఆర్డర్ పెట్టాడు. ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకున్నాడు. సెప్టెంబర్‌ 23వ తేదీన నిషాత్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల భరత్‌ సాహూ అనే డెలివరీ ఏజెంట్‌ ఫోన్‌ ఇచ్చేందుకు చిన్‌హాట్‌కు వెళ్లాడు. అక్కడ గజానన్‌, అతడి ఫ్రెండ్‌ ఆకాశ్‌తో కలిసి సాహుని గొంతు నులిమి చంపేశాడు. తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి దగ్గరలో ఉన్న ఇందిరా కెనాల్‌లో పడేశారు. రెండు రోజులైనా సాహు ఇంటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులు ఆందోళన చెందిన సెప్టెంబర్‌ 25వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కింద కేసు నమోదు చేసుకున్నారు. సాహు కాల్‌ డేటా, ఫోన్‌ లొకేషన్‌ను ట్రేస్‌ చేస్తే గజానన్‌తో చివరిసారిగా ఫోన్‌లో మాట్లాడినట్టు తేలింది. పోలీసుల తమ స్టయిల్‌లో విచారణ జరిపి సరికి గజానన్‌ నేరాన్ని ఒప్పుకున్నాడు.

Eha Tv

Eha Tv

Next Story