పార్లమెంట్(Parliament) లో విపక్ష ఎంపీల(Opposition MPs) సస్పెన్షన్ల(suspension) పర్వం కొనసాగుతోంది. మంగళవారం మరో 49 మంది విపక్ష ఎంపీలపై స్పీకర్(Speaker) సస్పెండ్ చేశారు. లోక్సభలో(Lok Sabha) దుండగుల చొరబాటుపై హోంమంత్రి అమిత్ షా (Amit Shah)ప్రకటన చేయాలంటూ స్పీకర్ వెల్లోకి దూసుకువచ్చిన విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో శీతాకాల సమావేశాలు(Winter sessions) మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు సస్పెండైన ఎంపీల సంఖ్య 141కి చేరింది.

141 MPs Suspension

పార్లమెంట్లో విపక్షాల నిరసనలతో గందరగోళం నెలకొంది. ఈ నెల 13న లోక్ సభలో ఆగంతుకుల చొరబాటుపై మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలంటూ విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. ఈ క్రమంలోనే స్పీకర్ వెల్లోకి వెళ్లి మరీ నినాదాలు చేశారు. దీంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ స్పీకర్ మరో 49 మంది ఎంపీలపై వేటు వేశారు. అంతకుముందు సభ్యుల సస్పెన్షన్కు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో లోక్సభ ఆమోదించింది. వీరందరినీ శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సస్పెన్షన్కు గురైన వారిలో సుప్రియా సూలే, ఫరూక్ అబ్దుల్లా, శశి థరూర్, కార్తి చిదంబరం, డింపుల్ యాదవ్, మనీశ్ తివారీ ఉన్నారు.
ఇక శీతాకాల పార్లమెంట్ సమావేశాలు మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు 141 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. గత వారం 13 మంది, డిసెంబర్ 18న మరో 33 మంది ఎంపీలను..తాజాగా 49తో కలిపి మొత్తం లోక్ సభలో 95 మంది సస్పెండ్ అయ్యారు. రాజ్యసభలో ఇప్పటి వరకు 46 మందిని సస్పెండ్ చేశారు. దీంతో ఉభయ సభల్లో ఇప్పటి వరకు మొత్తం 141 మంది ఎంపీలను సస్పెన్షన్కు గురయ్యారు. పార్లమెంట్ చరిత్రలోనే ఇంత మందిని సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారి. మరోవైపు డిసెంబర్ 22తో శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి.