లోక్‌సభ స్పీకర్(Lok sabha Speaker) ఎవరు.? ఆ పదవి ఎవరికి ఇస్తారు?

లోక్‌సభ స్పీకర్(Lok sabha Speaker) ఎవరు.? ఆ పదవి ఎవరికి ఇస్తారు? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి(NDA Alliance) నుంచి ఇప్పటి వరకు ఎవరి పేరూ బయటకు రాలేదు. మిత్ర పక్షాలకు ఇస్తారా? బీజేపీ ఎంపీనే(BJP MP) స్పీకర్‌ అవుతారా? ఈ సస్పెన్స్ కొనసాగుతుండగానే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక తేదీ ఖరారైంది. పార్లమెంట్ తొలి సెషన్ ప్రారంభమైన రెండు రోజుల తర్వాత.. అంటే జూన్ 26వ తేదీన స్పీకర్ ఎన్నిక(Lok sabha Speaker Election) జరగనున్నట్టు లోక్‌సభ సెక్రటేరియెట్ ప్రకటించింది. ఎన్నిక జరగనున్న ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు తాము మద్దతు ఇచ్చే ఇతర సభ్యుడి పేరుని సెక్రటరీ జనరల్‌కు రాత పూర్వకంగా తెలియచేయవచ్చని తెలిపింది. ఇదిలా ఉంటే లోక్‌సభ సమావేశాల్లో మొదటి రెండు రోజులను కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారానికి కేటాయించ నున్నారు. ఇక జూన్ 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు(Parliament Sessions) జరగనున్నాయి. మొదటి రెండు రోజుల పాటు కొత్త ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం లేదా లోక్‌సభలో వారి సభ్యత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం సభ స్పీకర్‌‌ను ఎన్నుకుంటారు. జూన్ 27న రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ప్రధాని మోదీ తన మంత్రి మండలిని పార్లమెంటుకు పరిచయం చేస్తారని తెలుస్తోంది.

Eha Tv

Eha Tv

Next Story