కాంగ్రెస్‌(Congress) నాయకుడు రాహుల్‌గాంధీ(Rahul Gandhi) ఇప్పుడు మాజీ ఎంపీ(Ex-MP) మాత్రమే! ఎంపీగా ఆయనపై అనర్హత వేటు వేసింది లోక్‌సభ సెక్రటేరియెట్‌. నిన్నటి నుంచి ప్రజాస్వామ్య వాదులు ఊహించిందే జరిగింది. ప్రజాప్రాతినిధ్య చట్టం(Representation of Peoples Act)లోని సెక్షన్‌ల ప్రకారమే ఆయనపై అనర్హత వేటు అమలు చేస్తున్నట్టు లోక్‌సభ సెక్రటేరియెట్‌ అంటోంది కానీ ఇది కక్షపూరిత చర్యేనని చాలా మంది నమ్మిక.

కాంగ్రెస్‌(Congress) నాయకుడు రాహుల్‌గాంధీ(Rahul Gandhi) ఇప్పుడు మాజీ ఎంపీ(Ex-MP) మాత్రమే! ఎంపీగా ఆయనపై అనర్హత వేటు వేసింది లోక్‌సభ సెక్రటేరియెట్‌. నిన్నటి నుంచి ప్రజాస్వామ్య వాదులు ఊహించిందే జరిగింది. ప్రజాప్రాతినిధ్య చట్టం(Representation of Peoples Act)లోని సెక్షన్‌ల ప్రకారమే ఆయనపై అనర్హత వేటు అమలు చేస్తున్నట్టు లోక్‌సభ సెక్రటేరియెట్‌ అంటోంది కానీ ఇది కక్షపూరిత చర్యేనని చాలా మంది నమ్మిక. 2019 ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ కేరళ వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా విజయంసాధించారు. ఇప్పుడు ఈ నిర్ణయంతో ఆయన ఎంపీగా అర్హత కోల్పోయారు. తీర్పుపై అభ్యర్థన పిటిషన్‌కు కోర్టు 30 రోజుల గడువు ఇచ్చినప్పటికీ.. ఈలోపే ఆయనపై అనర్హత వేటు అమలు చేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ప్రకటించడం విచిత్రం.

ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్‌ 8(3) ప్రకారం.. పార్లమెంట్‌ సభ్యుడు ఎవరికైనా సరే.. ఏదైనా కేసులో రెండేళ్ల కనీస శిక్ష, ఆపై శిక్ష పడితే.. అనర్హత వేటు పడి పదవీ కోల్పోతారు. రాహుల్‌గాంధీ కూడా అందుకే పదవిని కోల్పోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కర్ణాటకలోని కోలార్‌ దగ్గర జరిగిన ర్యాలీలో రాహుల్‌ పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోదీ(PM Modi)పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే నీరవ్‌ మోదీ(Nirav Modi), లలిత్‌ మోదీ(Lalit Modi) పేర్లను ప్రస్తావిస్తూ దేశంలో దొంగల పేర్లన్నీ మోదీ పేరుతోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ సూరత్‌ కోర్టులో రాహుల్‌పై పరువునష్టం దావా వేశారు. నాలుగేళ్ల పాటు విచారణ సాగింది. వాదోపవాదాలన్నీ ముగిసిన తర్వాత రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్‌ కోర్టు( Surat Court) తీర్పు చెప్పింది.

Updated On 24 March 2023 6:42 AM GMT
Ehatv

Ehatv

Next Story