రానున్న లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections 2024) పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) బీజీ అయ్యింది. ఇప్పటికే 40 అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ(Congress Central Election Committee) ఖరారు చేసింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఈసారి కూడా కేరళ(Kerala)లోని వయనాడ్‌(Wayanad) లోక్‌సభ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections 2024) పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) బీజీ అయ్యింది. ఇప్పటికే 40 అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ(Congress Central Election Committee) ఖరారు చేసింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఈసారి కూడా కేరళ(Kerala)లోని వయనాడ్‌(Wayanad) లోక్‌సభ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) సారథ్యంలో సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ గురువారం రాత్రి ఢిల్లీ(Delhi)లో సమావేశమయ్యింది. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి దాదాపు 60 లోక్‌సభ స్థానాలలో అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయా, లక్షద్వీప్‌కు సంబంధించి పలు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ సమావేశంలో ఖర్గేతో పాటు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్‌ కూడా పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భుపేష్‌ బఘేల్‌ రాజ్‌నంద్‌గావ్‌ నియోజకవర్గంనుంచి, మాజీ మంత్రి తామ్రధ్వజ్‌ సాహూ మహసముంద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. రాహుల్‌ గాంధీ వయనాడ్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌లోని ఆమేథీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేస్తారు. కిందటి ఎన్నికల్లో రాయబరేలీలో సోనియాగాంధీ విజయం సాధించిన విషయం విదితమే! ఆమె రాజ్యసభకు వెళ్లడంతో రాయబరేలీ నుంచి ప్రియాంకను బరిలో దింపుతున్నారు.

Updated On 8 March 2024 12:28 AM GMT
Ehatv

Ehatv

Next Story