దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 19 నుండి జూన్ 1, 2024 వరకు

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 19 నుండి జూన్ 1, 2024 వరకు ఎగ్జిట్ పోల్స్‌ను నిషేధించనున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ చర్యలను అమలు చేసేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీసులు పలు చర్యలు చేపట్టనున్నారు. కళ్యాణ మంటపాలు, కమ్యూనిటీ హాళ్లు, లాడ్జీలు, బయటి వ్యక్తులు బస చేసే గెస్ట్‌హౌస్‌లలో తనిఖీలు చేయాల్సి ఉంటుంది. నియోజకవర్గం వెలుపలి నుంచి వాహనాల రాకపోకలను పర్యవేక్షించేందుకు నియోజకవర్గ సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద పటిష్టమైన భద్రతను అమలు చేయనున్నారు. ఆయా వ్యక్తులు సంబంధిత నియోజకవర్గంలో నమోదు చేసుకున్న ఓటర్లు కాదా అని నిర్ధారించడానికి, అవసరమైతే గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది.

లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో 12 రాష్ట్రాల్లో 25 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో ఎన్నికలు జరుగుతున్నందున ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించరాదని ఈసీ స్పష్టం చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఎన్నికల ఫలితాలు, సర్వేలు, ఒపీనియన్ పోల్స్ ప్రదర్శించరాదని ఈసీ తేల్చి చెప్పింది. ఏప్రిల్ 19న ఓటింగ్ జరిగిన 21 రాష్ట్రాలు/యూటీలలో పశ్చిమ బెంగాల్‌లో 77 శాతం కంటే ఎక్కువ ఓటింగ్‌ నమోదైంది. బీహార్‌లో అత్యల్పంగా 47.49 శాతం నమోదవడంతో లోక్‌సభ ఎన్నికల ఫేజ్-1 ఓటింగ్ ముగిసింది.

Updated On 19 April 2024 9:28 PM GMT
Yagnik

Yagnik

Next Story