ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్థులు నానా తిప్పలు పడుతుంటారు. ఓటర్లను ఆకట్టుకోవడం కోసం పడరాని పాట్లు పడుతుంటారు. కొందరు నేతలు ప్రచారంలో నానా విన్యాసాలు చేస్తుంటారు. దోశలు వేస్తారు. బజ్జీలు చేస్తారు. బట్టలుతుకుతారు. ఇస్త్రీ చేస్తారు. ఏ షాపు దగ్గరకు వెళితే ఆ షాపు ఓనర్‌లా బిహేవ్ చేస్తారు. చివరాఖరికి పిల్లల ముడ్లు కూడా కడుగుతారు.
ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్థులు నానా తిప్పలు పడుతుంటారు. ఓటర్లను ఆకట్టుకోవడం కోసం పడరాని పాట్లు పడుతుంటారు. కొందరు నేతలు ప్రచారంలో నానా విన్యాసాలు చేస్తుంటారు. దోశలు వేస్తారు. బజ్జీలు చేస్తారు. బట్టలుతుకుతారు. ఇస్త్రీ చేస్తారు. ఏ షాపు దగ్గరకు వెళితే ఆ షాపు ఓనర్‌లా బిహేవ్ చేస్తారు. చివరాఖరికి పిల్లల ముడ్లు కూడా కడుగుతారు. ఓటర్లను అట్రాక్ట్ చేసుకోవడానికి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. తమిళనాడు(Tamilnadu)లోని అధికార డీఎంకే అభ్యర్థి మురసోలి(Murasoli) కూడా ఇలాగే ప్రచారం చేసుకుంటున్నారు. వేకువ జామునే నిద్రలేని రోడ్డుమీదకు వచ్చేస్తున్నారు. తంజావూరు నియోజకవర్గ కేంద్రంలో మార్నింగ్ వాక్ చేస్తున్న వారితో ముచ్చటించారు. సొంత ఖర్చుతో వారికి హెర్బల్ జ్యూస్ తాగించారు. కాసేపు సైకిల్ తొక్కారు. తనకు ఓటు వేయాలంటూ విన్నవించుకున్నారు.