వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీజేపీ.. పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. మంగళవారం కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని చేసిన అనంతరం.. మరికొంతమంది కేంద్ర మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తుంది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. పార్టీ-సంఘ్ సమన్వయకర్త అరుణ్ కుమార్‌తో భవిష్యత్ మార్పులపై చర్చించారు.

Lok Sabha Election BJP To Shift More Ministers To Organization Six States Party Chief May Changed Including Mp
వచ్చే లోక్‌సభ(Loksabha) ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీజేపీ(BJP).. పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. మంగళవారం కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి(Kishan Reddy)ని తెలంగాణ(Telangana) రాష్ట్ర అధ్యక్షుడిని చేసిన అనంతరం.. మరికొంతమంది కేంద్ర మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తుంది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda).. పార్టీ-సంఘ్ సమన్వయకర్త అరుణ్ కుమార్(Arun Kumar)తో భవిష్యత్ మార్పులపై చర్చించారు.
లోక్‌సభ ఎన్నికలు జరగనున్నందున మార్పుల ద్వారా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాలుగు రాష్ట్రాల అధ్యక్షులను మార్చిన అధిష్టానం.. కర్ణాటక(Karnatala), ఛత్తీస్‌గఢ్(Chhattisgarh), మధ్యప్రదేశ్(Madhyapradesh), రాజస్థాన్(Rajasthan), గుజరాత్(Gujarat) సహా ఆరు రాష్ట్రాల్లో కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించనున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత వర్షాకాల సమావేశాలకు ముందే కేంద్ర మంత్రివర్గంలో మార్పు ఉంటుంది.
బుధవారం నడ్డా, అరుణ్‌కుమార్ మధ్య సుమారు గంటపాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా నడ్డా ఇప్పటి వరకు జరిగిన మార్పులు, భవిష్యత్తులో జరిగే మార్పుల గురించి తెలియజేసినట్లు విశ్వసనీయ సమాచారం. నడ్డా.. మాండవ్య, ప్రహ్లాద్ సింగ్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియాలను కూడా కలిశారు. మంగళవారం అరడజను మంది కేంద్ర మంత్రులు.. నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman), భూపేంద్ర యాదవ్(Bupendra Yadav), కిరెన్ రిజిజు(Kiren Rijiju), గజేంద్ర సింగ్ షెకావత్(Gajendra Singh Shekhawat), అర్జున్ మేఘ్వాల్, ఎస్పీ సింగ్ బఘేల్.. నడ్డాతో సమావేశమయ్యారు.
ఎన్నికల సన్నద్ధత కోసం కొందరు కేంద్ర మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య లేదా పురుషోత్తమ్ రూపాలాకు గుజరాత్, ప్రహ్లాద్ పటేల్ లేదా నరేంద్ర సింగ్ తోమర్‌లకు మధ్యప్రదేశ్‌లో బాధ్యతలు.. వీరితో పాటు కొందరు మంత్రులకు కేంద్ర సంస్థలో కొత్త బాధ్యతలు అప్పగించనున్నారు.
