అయోధ్యలో(Ayodhya) రామమందిరం ప్రారంభోత్సవానికి(Inauguration) సమయం దగ్గరపడుతోంది. అందరిలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన అయోధ రామాలయం ప్రారంభోత్సవ వేడుక జరగనుంది. ఈ క్రమంలో రామమందిరం కోసం ఆలీగఢ్‌కు(Aligarh) చెందిన ఓ కళాకారుడు రాముడి కోసం ఓ అరుదైన కానుకను(Gift) తయారుచేశారు.

అయోధ్యలో(Ayodhya) రామమందిరం ప్రారంభోత్సవానికి(Inauguration) సమయం దగ్గరపడుతోంది. అందరిలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన అయోధ రామాలయం ప్రారంభోత్సవ వేడుక జరగనుంది. ఈ క్రమంలో రామమందిరం కోసం ఆలీగఢ్‌కు(Aligarh) చెందిన ఓ కళాకారుడు రాముడి కోసం ఓ అరుదైన కానుకను(Gift) తయారుచేశారు. చేతితో తాళాలు తయారు చేయడంలో ఖ్యాతి గడించిన సత్యప్రకాశ్‌ శర్మ(Sathya Prakash sharma) అనే వ్యక్తి రాముడి గుడి కోసం ప్రత్యేకంగా 400 కిలోల తాళం తయారు చేశారు. ప్రపంచంలోనే చేతితో తయారు చేసిన అతి పెద్ద తాళం ఇదే! ఈ తాళం పది అడుగుల ఎత్తు, నాలుగున్నర అడుగుల వెడల్పు, తొమ్మిదిన్నర అంగుళాల మందంతో ఉంది. తాళం(Lock) చెవినే నాలుగు అడుగుల పొడవుంది. సత్యప్రకాశ్‌ శర్మ కుటుంబం కొన్ని తరాల నుంచి తాళాల తయారీ వృత్తిలో ఉంది. ఈ ఏడాది ఆరంభంలో అలీగఢ్ ఎగ్జిబిషన్‌లో ఈ తాళాన్ని ప్రదర్శించారు. తాళం తయారు చేయడంలో సత్యప్రకాశ్‌ శర్మ భార్య రుక్మిణి కూడా తోడ్పాటు ఎంతో ఉంది. ఇంత పెద్ద తాళాన్ని తయారు చేయడానికి సత్యప్రకాశ్‌కు రెండు లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. డిసెంబర్‌ చివరి వారంలో ఈ తాళాన్ని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు సమర్పిస్తారు.

Updated On 14 Nov 2023 2:40 AM GMT
Ehatv

Ehatv

Next Story