సహజీవనాన్ని(Cohabitation) ఓ ప్రమాదకరమైన జబ్బుగా అభివర్ణించారు బీజేపీ ఎంపీ ధరంవీర్ సింగ్(Daramveer Singh). లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిన హర్యానా(Haryana)కు చెందిన ఆ ఎంపీ లివ్ ఇన్ రిలేషన్‌షిప్(Live-In Relationship) అన్నది ఓ దురాచారమని వ్యాఖ్యానించారు. సమాజం నుంచి దాన్ని నిర్మూలించాల్సిన అవసరముందన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఓ చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
సహజీవనాన్ని(Cohabitation) ఓ ప్రమాదకరమైన జబ్బుగా అభివర్ణించారు బీజేపీ ఎంపీ ధరంవీర్ సింగ్(Daramveer Singh). లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిన హర్యానా(Haryana)కు చెందిన ఆ ఎంపీ లివ్ ఇన్ రిలేషన్‌షిప్(Live-In Relationship) అన్నది ఓ దురాచారమని వ్యాఖ్యానించారు. సమాజం నుంచి దాన్ని నిర్మూలించాల్సిన అవసరముందన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఓ చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ధరంవీర్ సింగ్ సహజీవనంపై పెద్ద ప్రసంగమే చేశారు. వసుధైవ కుటుంబకమ్ అనే తత్వానికి భారతీయ సంస్కృతి ప్రసిద్ధి అని, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే మన సామాజిక నిర్మాణం కూడా భిన్నమైనదని చెప్పారు. ప్రేమ పెళ్లిళ్లలో విడాకుల శాతం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. వివాహబంధం విషయంలో ఉభయ కుటుంబాల పెద్దల అంగీకారం తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. సహజీవనం సమాజంలో ఓ ప్రమాదకరమైన జబ్బుగా మారుతోందని అన్నారు. విదేశాల్లో లివ్ ఇన్ రిలేషన్‌షిప్ సాధారణమే అయినప్పటికీ మన దేశంలో కూడా ఇలాంటి పోకడలు పెరుగుతున్నాయని తెలిపారు. వీటి పరిణామాలు మాత్రం అత్యంత భయంకరంగా ఉంటున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా శ్రద్ధా వాకర్-అఫ్తాబ్ పూనావాల కేసును ఆయన ఉదహరించారు. ఢిల్లీలో శ్రద్ధా వాకర్‌ను అఫ్తాబ్ పూనావాల దారుణంగా హత్య చేసి ఆమె శరీరాన్ని 35 భాగాలుగా చేసి వేర్వేరు ప్రదేశాలలో విసిరేసిన సంగతి తెలిసిందే. సమాజంలో ఇప్పటికీ పెద్దలు కుదిర్చిన వివాహాలకే అధిక ప్రాధాన్యం ఉందని ధరంవీర్ అభిప్రాయపడ్డారు. అమెరికాలో విడాకుల రేటు 40శాతంగా ఉంటే భారత్‌లో అది 1.1శాతంగా ఉందన్నారు. ఇటీవల మన దగ్గర కూడా విడాకుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రేమ పెళ్లిళ్లలోనే ఇవి ఎక్కువగా ఉన్నాయన్నారు ధరంవీర్ సింగ్.