భారతదేశంలోని పాఠశాలలు(School) అద్భుతమైన విద్యను అందజేస్తున్నాయి. మేధోపరంగా, సామాజికంగా ప్రపంచ పౌరులుగా మారడానికి విద్యార్థులను రూపొందిస్తున్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉత్తమ పాఠశాల విద్యను అందించాలని కోరుకుంటారు, కానీ పెరుగుతున్న పోటీని బట్టి వారికి సరైన స్కూల్‌ను ఎంచుకోవడం సవాలుగా మారింది.

భారతదేశంలోని పాఠశాలలు(School) అద్భుతమైన విద్యను అందజేస్తున్నాయి. మేధోపరంగా, సామాజికంగా ప్రపంచ పౌరులుగా మారడానికి విద్యార్థులను రూపొందిస్తున్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉత్తమ పాఠశాల విద్యను అందించాలని కోరుకుంటారు, కానీ పెరుగుతున్న పోటీని బట్టి వారికి సరైన స్కూల్‌ను ఎంచుకోవడం సవాలుగా మారింది. దేశం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, కొన్ని స్కూళ్లల్లో విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయి. కొన్ని పాఠశాలలు చాలా ఖరీదైనవి, సామన్యుల పిల్లలను ఎవరూ కూడా తమ పిల్లలను అక్కడికి పంపించలేరు. భారతదేశంలోని ఉత్తమ పాఠశాల ఏది మరియు అత్యంత ఖరీదైన స్కూళ్లలో టాప్ 10లో నిలిచినవి ఇవే.

1. డూన్ స్కూల్, డెహ్రాడూన్(Doon School, Dehradun): ఈ స్కూల్‌లో సంవత్సరానికి రూ. 10,25,000 ఫీజు ఉండగా ప్రతి టర్మ్‌కు దాదాపు రూ. 25,000 ఖర్చు అవుతుంది.

2. ది సింధియా స్కూల్(The Scindia School), గ్వాలియర్: ఇక్కడ వార్షిక ట్యూషన్ ఫీజు 12,00,000.

3. మాయో కాలేజ్(Mayo College), అజ్మీర్: ఈ స్కూల్‌లో ప్రవాస భారతీయులకు (NRIలు) వార్షిక ట్యూషన్ రూ. 13,00,000 ఉంది. భారతీయ విద్యార్థులకు రూ. 6,50,000.

4. ఎకోల్ మొండియల్ వరల్డ్ స్కూల్(Ecole Mondial World School), జుహు, ముంబై: ఇక్కడ వార్షిక ఖర్చు రూ. 9,90,000 కాగా ఉంటే సీనియర్ విభాగానికి ఫీజు రూ. 10,90,000.

5. వెల్హామ్ బాయ్స్ స్కూల్(Welham Boys School), డెహ్రాడూన్: పాఠశాల విద్యకు సంవత్సరానికి రూ.5,70,000 ఖర్చు అవుతుంది.

6. వుడ్‌స్టాక్ స్కూల్(Woodstack school), ముస్సోరీ: 6 నుండి 10 తరగతులకు ట్యూషన్ ఖర్చు రూ. 16,00,000 ఉంటే 10 నుండి 12 తరగతులకు రూ. 17,65,000.

7. గుడ్ షెపర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్(Good Shepherd International School), ఊటీ: గుడ్ షెపర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ట్యూషన్ ఖర్చు రూ. 6.10 నుంచి 15 లక్షల వరకు ఉంటుంది.

8. స్టోన్‌హిల్ ఇంటర్నేషనల్ స్కూల్(Stonehill International School), బెంగళూరు: విదేశాల నుంచి వచ్చిన విద్యార్థుల కోసం స్టోన్‌హిల్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక ట్యూషన్‌గా రూ.9,00,000 వసూలు చేస్తుంది.

9. బిర్లా పబ్లిక్ స్కూల్(Birla Public School), పిలాని: ఈ పాఠశాలలో ప్రతి సంవత్సరం 3 నుంచి 10వ తరగతి వరకు రూ.2,89,200 ఫీజు ఉంది. 11 నుంచి 12వ తరగతి వరకు రూ.3,19,200 వసూలు చేస్తున్నారు.

10. బిషప్ కాటన్ స్కూల్(Bishop Cotton School), సిమ్లా: ఇక్కడ స్కూల్ ఫీజులు రూ.4,10,000 నుంచి రూ.4,80,000 వరకు ఉంటాయి.

Updated On 8 Feb 2024 4:20 AM GMT
Ehatv

Ehatv

Next Story