పెదాలకు వేసుకునే లిప్‌స్టిక్‌ కారణంగా ఓ మహిళపై బదిలీ వేటు పడింది.

పెదాలకు వేసుకునే లిప్‌స్టిక్‌ కారణంగా ఓ మహిళపై బదిలీ వేటు పడింది. పైగా సరిగ్గా పని చేయడం లేదనే అపవాదును భరించాల్సి వచ్చింది. ఈ చిత్రమైన సంఘటన చెన్నై(Chennai) నగర కార్పొరేషన్‌లో జరిగింది. చెన్నై నగర మేయర్‌ ప్రియ(Priya) వెన్నంటి ఉండే మహిళా దఫేదాస్‌ మాధవి(Madhavi) లిప్‌స్టిక్‌ గొడవలో చిక్కుకుని బదిలీ అయ్యింది. చెన్నై కార్పొరేషన్‌లో ఆమె పదిహేనేళ్లుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె డీఎంకే మేయర్‌ ఆర్‌.ప్రియ(DMK Mayor R Priya Rajan)కు దఫేదార్‌గా ఉన్నారు. ఏమైందో ఏమో కానీ చెప్పాపెట్టకుండా మాధవిని మనలి మండలానికి ట్రాన్స్‌ఫర్‌ చేశారు అధికారులు. అంతే కాదు, ఆమెకు ఓ మెమోను కూడా జారీ చేశారు. మాధవిపై అంత కోపం ఎందుకంటే ప్రియతో సరి సమానంగా మాధవి లిప్‌స్టిక్‌(Lipstick)వేసుకుని రావడమేనట! ప్రియ ఇగోకు మాధవి బలయ్యింది. మేయర్‌ ప్రియ వేసుకునే రంగులోనే మాధవి కూడా లిప్‌స్టిక్‌ వేసుకుని రావడాన్ని ప్రియ పీఏలు చాలా సార్లు తప్పుపట్టారు. అలా వేసుకోకూడదని హెచ్చరించారు కూడా! చినప్పట్నుంచి తనకు లిప్‌స్టిక్‌ వేసుకోవడం అలవాటని, తనకు నచ్చిన రంగు, ఫ్లేవర్‌ వాడతానని, సడన్‌గా మార్చుకోమంటే ఎలా అని మాధవి ఎదురు ప్రశ్నించారట! దీంతో ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టుగా ప్రియ ఫీలయ్యారు. వెంటనే మాధవిని ట్రాన్స్‌ఫర్‌ చేశారు. దాంతో పాటు ఆమె సరిగ్గా పనిచేయడం లేదంటూ ఓ మెమో కూడా ఇచ్చారు. తాను వేసుకునే లిప్‌స్టిక్, మేయర్‌ వేసుకునే లిప్‌స్టిక్‌ ఒకే విధంగా ఉందని పేర్కొంటున్నారని, అందుకే తనను బదిలీ చేశారని మాధవి చెప్పుకుని బాధపడుతున్నారు. ఇది తన వ్యక్తిగత విషయమని అంటూ పురుష దఫేదార్‌ ఇంటికి వెళ్లిపోయినా తాను మాత్రం మేయర్‌ వెన్నంటి రేయింబవళ్లు పని చేశానని, అందుకు తనకు మంచి గుర్తింపునే ఇచ్చారని అన్నారు. మేయర్‌ పదవిలో ప్రియ మహా అయితే రెండేళ్లు ఉంటారేమో, ప్రభుత్వ ఉద్యోగిగా తన ప్రయాణం కార్పొరేషన్‌లోనే కొనసాగాల్సి ఉంటుందని మాధవి చెప్పుకొచ్చారు.

ehatv

ehatv

Next Story