✕
సోపామూడు రోజుల వర్షానికే ఆపలు పడ్డాం. రెయిన్ రెయిన్ గో అవే అంటూ పాడేసుకున్నాం. మనకే ఇంతటి అసహనం వచ్చేస్తే నాన్‌స్టాప్‌గా వర్షాలు కురుస్తున్న చోట జనం అవస్థల మాటేమిటి? ఇదంతా మేఘాలయలోని(Meghalaya) మాసిన్రాం(Mawsynram) గురించే! ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యేది ఇక్కడే. ఇంతకు ముందు చిరపుంజి(Chirapunji) ఉండేది కానీ ఇప్పుడీ రికార్డు పొరుగునే ఉన్న మాసిన్రాం పేరిట ఉంది. ఇక్కడ వార్షిక సగటు వర్షపాతం దాదాపు 11,871 మిల్లీమీటర్లు ఉంటుంది.

x
Mawsynram
-
- సోపామూడు రోజుల వర్షానికే ఆపలు పడ్డాం. రెయిన్ రెయిన్ గో అవే అంటూ పాడేసుకున్నాం. మనకే ఇంతటి అసహనం వచ్చేస్తే నాన్‌స్టాప్‌గా వర్షాలు కురుస్తున్న చోట జనం అవస్థల మాటేమిటి? ఇదంతా మేఘాలయలోని(Meghalaya) మాసిన్రాం(Mawsynram) గురించే! ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యేది ఇక్కడే. ఇంతకు ముందు చిరపుంజి(Chirapunji) ఉండేది కానీ ఇప్పుడీ రికార్డు పొరుగునే ఉన్న మాసిన్రాం పేరిట ఉంది.
-
- ఇక్కడ వార్షిక సగటు వర్షపాతం దాదాపు 11,871 మిల్లీమీటర్లు ఉంటుంది. తూర్పు ఖాసీ కొండల్లో ఎత్తయిన ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం ప్రపంచంలోనే అత్యధిక తేమగల ప్రాంతంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో(Guinness Book of World Records) చోటు సంపాదించుకుంది. బంగాళాఖాతం నుంచి వీస్తున్న గాలు కారణంగా తేమ అధికంగా ఉంటుంది. 1985లో ఇక్కడ రికార్డు స్థాయిలో అత్యధికంగా 26 వేల మిల్లీమీటర్ల వార్షిక వర్షపాతం నమోదైంది.
-
- చిరపుంజికి జస్ట్ 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది మాసిన్రాం. లాస్టియర్ జూన్ 16న ఇక్కడ 24 గంటల వ్యవధిలో ఏకంగా 1003.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. మాసిన్రాంలో నివాసం ఉంటున్న నాలుగు వేల మంది ప్రజలకు వర్షాలు కొత్తేమీ కాదు. ఎప్పుడూ అవి పలకరిస్తూనే ఉంటాయి. ఇక్కడి వాతావరణం ఎప్పుడూ తేమగానే ఉంటుంది.
-
- అందుకే ఇక్కడి ప్రజల జీవన శైలి డిఫరెంట్‌గా ఉంటుంది. తినే తిండి నుంచి వేసుకునే బట్టల వరకు అన్నీ భిన్నంగా ఉంటాయి. ప్రతీ ఒక్కరి చేతిలో వెదురుతో(Bamboo) చేసిన ట్రెడిషనల్ గొడుగు(Traditional Umbrella) ఉంటుంది. దీన్ని వారు నప్(Nup) అని పిలుస్తారు. ఉతికే బట్టలు ఎండటం చాలా కష్టం. ఎండ ఉంటేగా ఎండటానికి? అందుకే మెడల్ డ్రైయర్‌లో ఉతికిన బట్టలను ఉంచుతారు. ఇక ఇళ్లలో హీటర్‌ను అనివార్యం. రోజూ వర్షం పడుతుండటంతో గోడలు, వస్తువులు ఇలా ప్రతీది తేమగానే ఉంటాయి.
-
- ఎడతెరిపి లేకుండా వానలు పడుతుంటే వ్యవసాయం చేయడం సాధ్యం కాదు కాబట్టి స్థానికులు చిన్నా చితకా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. నిత్యావసరాలను, కూరగాయాలను ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటుంటారు. ప్రతి సంవత్సరం మే నుంచి అక్టోబర్ వరకు భారీ వర్షాలు కురుస్తాయి. ఆ సమయంలో కొన్ని వారాల పాటు అసలు సూర్యుడే కనిపించడు. ప్రజలు కూడా ఇంటి నుంచి బయట కాలు పెట్టరు. ఉడికించిన బంగాళాదుంపలను ఎండు చేపలు, మిరపకాయలు, టమాటాలతో చేసిన చట్నీతో కలిపి తింటారు.
-
- ఈ చట్నీని టుంగ్టాప్(Tungtop) అంటారు. వర్షాలు పడుతూ ఉండటం వల్ల రోడ్లు తరచూ దెబ్బతింటాయి. ఎప్పుడు చూసినా వాటికి మరమత్తు పనులు జరుగుతూనే ఉంటాయి. వంతెనల పరిస్థితి కూడా అంతే! అందుకే రబ్బరు, వెదరుతో చేసిన చిన్నపాటి బ్రిడ్జీలను కట్టుకుంటారు. నీళ్లలో త్వరగా అవి పాడవ్వవు. పైగా ఓ స్థాయి వరకు బరువును తట్టుకోగలవు. అత్యధిక వర్షపాతం నమోదవుతుంది కాబట్టి సహజంగానే మాసిన్రాం ఓ టూరిస్టు ప్లేస్ అయ్యింది. పైగా సహజసిద్ధ అందాలకు ఇది ఫేమస్! ఇక్కడ బోల్డన్నీ జలపాతాలున్నాయి. దగ్గరలోనే మాజిమ్బ్యూయిన్ అనే గుహలు ఉన్నాయి.

Ehatv
Next Story