ఆమె ఉన్నత విద్యావంతురాలు. దానికి తోడు అపారమైన తెలివితేటలున్నాయి. ఇక దేవుడిచ్చిన అందం సరేసరి! కానీ బుద్ధి వక్రించింది. ఆలోచనలు చెడు మార్గం పట్టాయి. తన అందాన్ని, తెలివితేటలను ఉపయోగించుకుని లేడి డాన్‌గా(Lady don) ఎదిగింది. కరుడు కట్టిన నేరస్తురాలిగా మారిపోయింది. జనం ఆమెను లేడి డాన్‌ అని పిల్చుకునేవారు. కొందరు రివాల్వర్‌ రాణి(Rivolver Rani) అని కూడా అనేవారు. దేశంలోని అతి

ఆమె ఉన్నత విద్యావంతురాలు. దానికి తోడు అపారమైన తెలివితేటలున్నాయి. ఇక దేవుడిచ్చిన అందం సరేసరి! కానీ బుద్ధి వక్రించింది. ఆలోచనలు చెడు మార్గం పట్టాయి. తన అందాన్ని, తెలివితేటలను ఉపయోగించుకుని లేడి డాన్‌గా(Lady don) ఎదిగింది. కరుడు కట్టిన నేరస్తురాలిగా మారిపోయింది. జనం ఆమెను లేడి డాన్‌ అని పిల్చుకునేవారు. కొందరు రివాల్వర్‌ రాణి(Rivolver Rani) అని కూడా అనేవారు. దేశంలోని అతి పెద్ద గ్యాంగ్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌(Lawrence Bishnoi) ముఠాతో ఆమెకు నేరుగా సంబంధాలున్నాయి. ఆమె పేరు అనురాధ చౌదరి(Anuradha Chowdhary).. పుట్టింది రాజస్థాన్లోని సీకర్‌ జిల్లా. అనురాధ చిన్నతనంలోనే ఆమె తల్లి చనిపోయింది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న తండ్రి కూతురును అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు.

కుమార్తెను పెద్ద చదువులు చదివించాలన్న తన కలను సాకార చేసుకున్నాడు. అనురాధ చదువులో మేటి. చదును ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. రాజస్థాన్‌లోని ఓ యూనివర్సిటీ నుంచి బీటెక్‌ పట్టా పుచ్చుకుంది. బీటెక్‌ చదువుతున్న సమయంలోనే ఆమె తన సహ విద్యార్థి దీపక్‌ మింజా(Deepak Minja) ప్రేమలో పడింది. పెళ్లంటూ చేసుకుంటే దీపక్‌నే చేసుకోవాలనుకుంది. కానీ అనురాధ తండ్రికి ఈ పెళ్లి ఇష్టం లేదు. తండ్రి చెప్పినా వినకుండా దీపక్‌ను పెళ్లి చేసుకుంది. తన మాట కాదన్నందుకు కూతురుతో అనుబంధాన్ని తెంచుకున్నాడు తండ్రి. అనురాధ, దీపక్‌లు కుటుంబపోషణకు షేర్‌ ట్రెడింగ్‌లో దిగారు. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు చుట్టుపక్కల వారిని ప్రోత్సహించేవారు. కొంతకాలం వీరి బిజినెస్‌ బాగానే సాగింది.

తర్వాతే సమస్యలు రావడం మొదలయ్యాయి. అప్పులు పెరిగాయి. దాంతో డబ్బు సంపాదించేందుకు అనురాధ తప్పుడు మార్గాలను ఎంచుకుంది. రాజస్థాన్‌లో గ్యాంగ్‌స్టర్‌(Ganagstar) ఆనంద్‌పాల్‌(Anand Paul) ప్రభావం ఎక్కువగా ఉన్న రోజులవి! హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, కిడ్నాపులు వంటి నేరాలలో ఆనంద్‌పాల్‌ పేరు ప్రముఖంగా వినిపించేది. అలాంటి ఆనంద్‌పాల్‌ను అనురాధ కలుసుకుంది. ఆమె అందానికి, తెలివికి ఆనంద్‌పాల్‌ సరెండర్‌ అయ్యాడు. ఆమెతో అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఆనంద్‌పాల్‌ గ్యాంగ్‌లో అనురాధ సభ్యురాలయ్యింది. దీపక్‌ను పూర్తిగా వదిలేసింది.

దీపక్‌కు దూరమయ్యాక ఆనంద్‌పాల్‌ను అనురాధ పెళ్లి చేసుకుందని అంటుంటారు కానీ దీనిపై పక్కా ఆధారం లేదు. అనురాధకు ప్రేమతో రివాల్వర్‌ను ఉపయోగించడం నేర్పించాడు. అనేక నేరాలలో ట్రైనింగ్‌ ఇచ్చాడు. బదులుగా ఆనంద్‌పాల్‌కు ఇంగ్లీష్‌ నేర్పించింది అనురాధ. ఆ టైమ్‌లో అనురాధ చెప్పినట్టుగా వినేవాడు ఆనంద్‌పాల్‌. అనురాధ చెప్పింది శాసనంగా మారేది. 2017లో పోలీసులు జరిపిన ఓ ఎన్‌కౌంటర్‌లో ఆనంద్‌పాల్‌ చనిపోయాడు. ఆ సమయంలో అనురాధ జైల్లో ఉండింది. జైలు నుంచి విడుదలయ్యాక ఆనంద్‌పాల్ గ్యాంగ్‌ను తన చెప్పు చేతల్లోకి తీసుకుంది. తన గ్యాంగ్‌ను బలోపేతం చేయడానికి లారెన్స్‌ బిష్ణోయితో చేతులు కలిపింది. రాజస్థాన్‌లో మారణాయుధాల అక్రమ రవాణా అనురాధ గ్యాంగ్‌ పర్యవేక్షణలో సాగేది.

లారెన్స్‌ బిష్ణోయి గ్యాంగ్‌తో చేతులు కలిపిన అనురాధ కొంత కాలానికి కాలా జఠెడితో ఫ్రెండ్‌షిప్‌ చేసింది. కాలా జఠెడి కూడా బిష్ణోయ్‌ గ్యాంగ్‌ కోసమే పని చేసేవాడు. పాకిస్తాన్‌ నుంచి అక్రమంగా ఆయుధాలు తీసుకొచ్చే పనిని జఠెడీ చూసుకునేవాడు. అనురాధ, కాలా జఠెడీ కలసివుండసాగారు. వీరిద్దరు ఓ గుళ్లో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నారని అంటుంటారు. తర్వాత వీరిద్దరు మారు పేర్లతో దేశంలోని వివిధ ప్రాంతాలలో తమ కార్యకలాపాలను సాగించారు. 2021లో పోలీసులకు పట్టుబడ్డారు. ప్రస్తుతం జైల్లో ఉన్నారు.

Updated On 16 Aug 2023 7:32 AM GMT
Ehatv

Ehatv

Next Story