ఆటపాటలతో అల్లారుముద్దుగా పెరగాల్సిన లిసిప్రియా(Lisi Priya) అనే ఓ బాలిక.. అవన్నీ పక్కకు పెట్టింది. ఇంత చిన్న వయసులోనే గొప్ప సామాజిక స్పృహ కలిగి ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. పర్యావరణం కలుషితమవుతుందని(Pollution).. పర్యావరణాన్ని(Environment) కాపాడాలంటూ అంతర్జాతీయ వేదికలపై(International stage) తన గొంతును వినిపిస్తోంది. నవంబర్‌ 30న ప్రారంభమైన కాప్‌-28 సదస్సు(COP-28 conference) డిసెంబర్‌ 12తో ముగియనుంది

ఆటపాటలతో అల్లారుముద్దుగా పెరగాల్సిన లిసిప్రియా(Lisi Priya) అనే ఓ బాలిక.. అవన్నీ పక్కకు పెట్టింది. ఇంత చిన్న వయసులోనే గొప్ప సామాజిక స్పృహ కలిగి ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. పర్యావరణం కలుషితమవుతుందని(Pollution).. పర్యావరణాన్ని(Environment) కాపాడాలంటూ అంతర్జాతీయ వేదికలపై(International stage) తన గొంతును వినిపిస్తోంది. నవంబర్‌ 30న ప్రారంభమైన కాప్‌-28 సదస్సు(COP-28 conference) డిసెంబర్‌ 12తో ముగియనుంది. దీనికి 190 దేశాల నుంచి 60వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. దుబాయ్‌(Dubai) వేదికగా 'కాప్-28' ప్రపంచ వాతావరణంపై సదస్సు జరుగుతోంది. ఇందులో దేశవిదేశాల నుంచి వచ్చిన పలువురు పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి ఉన్నతస్థాయి కార్యక్రమంలో ఓ 12 ఏళ్ల భారతీయ బాలికపై డయాస్‌పై దూసుకొచ్చింది.

' శిలాజ ఇంధనాలకు ముగింపు చెప్పండి.. మన భూగ్రహాన్ని, భవిష్యత్‌ను రక్షించండి' అంటూ ప్లకార్డును ఈ వేదికపై ప్రదర్శించింది. మణిపూర్‌కు చెందిన చిన్నారి లిసిప్రియా కంగుజం శిలా ఇంధనాల వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాప్‌ సదస్సుకు వచ్చిన ఈ బాలిక.. ప్రేక్షకుల మధ్య నుంచి ప్లకార్డు పట్టుకొని వేదికపై దూసుకొచ్చింది. ప్లకార్డును ప్రదర్శించిన పర్యావారణాన్ని కాపాడాలని నినదించింది. అక్కడి సిబ్బంది ఆమెను నిలువరించేందుకు ప్రయత్నించినా తన ప్రసంగం మాత్రం అలాగే కొనసాగించింది. కాసేపటి తర్వాత ఆ చిన్నారిని అక్కడి నుంచి సిబ్బంది తీసుకెళ్లారు. దీనిపై ట్విట్టర్‌ ద్వారా బాలిక మరోసారి నిరసన తెలిపారు. శిలాజ ఇంధనాలను వాడొద్దని చెప్తే నన్ను అరగంట పాటు బంధిస్తారా అని ఆమె ప్రశ్నించింది. ఐరాస ప్రాంగణంలోనే బాలల హక్కులను హరించారని.. నా గళాన్ని వినిపించే హక్కు ఉందని ట్విట్టర్‌లో పేర్కొంది.

కాప్-28 సదస్సుకు ఈస్ట్‌ తైమూర్‌ ప్రత్యేక రాయబారిగా సదస్సుకు లిసిప్రియా హాజరైంది. చిన్నవయసు నుంచే పర్యావరణాన్ని కాపాడాలని పోరాడుతోంది. వాతావరణ మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్‌పై పలు వేదికల్లో ప్రసంగించింది. క్లైమేట్ చేంజ్‌లా తీసుకురావాలని గతంలో భారత పార్లమెంట్ కూడా ఈమె నిరసనలు తెలిపింది. లిసిప్రియాకు వరల్డ్ చిల్డ్రన్ పీస్‌ ప్రైజ్ కూడా లభించింది.

Updated On 12 Dec 2023 5:40 AM GMT
Ehatv

Ehatv

Next Story