మహారాష్ట్ర(Maharashtra) నాసిక్(Nasik) శహాదా పట్టణంలోని ఓ ఆస్పత్రిలోకి(Hospital) చిరుత(Leopard) దూరింది. ఆస్పత్రిలో చిరుత దాదాపు నాలుగు గంటలపాటు బీభత్సం సృష్టించింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది, రోగులు భయభ్రాంతులు చెందారు. శహాదా పట్టణంలోని ఆదిత్య ఆస్పత్రిలో(Aditya Hospial) ఈ ఘటన చోటు చేసుకుంది. అప్రమత్తమైన సిబ్బంది రోగులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రూమ్‌ల తలుపులు బిగించారు.
మహారాష్ట్ర(Maharashtra) నాసిక్(Nasik) శహాదా పట్టణంలోని ఓ ఆస్పత్రిలోకి(Hospital) చిరుత(Leopard) దూరింది. ఆస్పత్రిలో చిరుత దాదాపు నాలుగు గంటలపాటు బీభత్సం సృష్టించింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది, రోగులు భయభ్రాంతులు చెందారు. శహాదా పట్టణంలోని ఆదిత్య ఆస్పత్రిలో(Aditya Hospial) ఈ ఘటన చోటు చేసుకుంది. అప్రమత్తమైన సిబ్బంది రోగులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రూమ్‌ల తలుపులు బిగించారు. చిరుతపై అటవీశాఖ అధికారులకు ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో చిరుతను బంధించేందుకు అధికారులు విశ్వ ప్రయత్నం చేశారు. చిరుతను ఓ గదిలో బంధించేందుకు ప్రయత్నించారు. చిరుత సమాచారం తెలుసుకున్న ప్రజలు భారీగా అక్కడికి చేరుకున్నారు. దీంతో అధికారులకు చిరుతను బంధించేందుకు ఆటంకాలు వచ్చాయి. ఇటు ప్రజల హడావిడిని తగ్గించేందుకు పోలీసు సిబ్బంది నానా తంటాలు పడ్డారు. దాదాపు నాలుగు గంటల పాటు చిరుత ఆస్పత్రిలో హల్‌చల్ చేసింది. చిరుతను పట్టుకునేందుకు అటవీఅధికారులు నాలుగు గంటల పాటు శ్రమించి సురక్షితంగా దానిని బంధించారు.
చిరుతను బంధించడంతో ఆస్పత్రిలో ఉన్న రోగులు, సిబ్బంది, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.