మన దగ్గర వినాయకచవితి(Vinayaka Chathurthi) సందర్భంగా మంటపాల్లో పెట్టిన వినాయకుడి లడ్డూను వేలం వేస్తారు కదా! అట్టాగే ఓ శివాలయంలో నిమ్మకాయను(Lemon) వేలం వేస్తారు. లడ్డూను కైవసం చేసుకోవడానికి ఎలా పోటీ పడతారో నిమ్మకాయను దక్కించుకోవడానికి కూడా భక్తులు తీవ్రంగా పోటీపడ్డారు.

Pathapusayan Temple
మన దగ్గర వినాయకచవితి(Vinayaka Chathurthi) సందర్భంగా మంటపాల్లో పెట్టిన వినాయకుడి లడ్డూను వేలం వేస్తారు కదా! అట్టాగే ఓ శివాలయంలో నిమ్మకాయను(Lemon) వేలం వేస్తారు. లడ్డూను కైవసం చేసుకోవడానికి ఎలా పోటీ పడతారో నిమ్మకాయను దక్కించుకోవడానికి కూడా భక్తులు తీవ్రంగా పోటీపడ్డారు. వివరాల్లోకి వెళితే తమిళనాడులోని(Tamilnadu) ఈరోడ్ దగ్గరలో ఉన్న శివగిరి గ్రామంలో(Shiva giri) పఠపూశయన్ దేవాలయం(Pathapusayan Temple) ఉంది. ఈ గుడిలో శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ అధికారులు చెబుతున్నదాని ప్రకారం శివుడికి ఓ నిమ్మకాయను, ఇతర పండ్లను, వస్తువులను సమర్పించడం ఇక్కడి సంప్రదాయం. పూజల్లో వాడిన ఆ నిమ్మకాయను వేలంలో(Lemon Auction) అమ్మకానికి పెట్టారు. ఈ వేలంలో 15 మంది భక్తులు పాల్గొన్నారు. ఈరోడ్‌కు చెందిన ఓ భక్తులు దీన్ని అత్యధికంఆ 35 వేల రూపాయలు పెట్టి సొంతం చేసుకున్నాడు. ఈ నిమ్మకాయను ఆలయ పూజారి తీసుకెళ్లి, శివుడి ముందు ఉంచి పూజ చేసి తిరిగి ఆ భక్తునికి అందించారు. ఈ నిమ్మకాయను సొంతం చేసుకున్న వారు సంపూర్ణ ఆరోగ్యంతో, సుఖ శాంతులతో ఉంటారని, ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఆ నిమ్మకాయకు అంత డిమాండ్!
