భారతీయ తబలా మాస్ట్రో, సంగీత దిగ్గజం, నిర్మాత, నటుడు జాకీర్ హుస్సేన్ ఇక లేరు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

భారతీయ తబలా మాస్ట్రో, సంగీత దిగ్గజం, నిర్మాత, నటుడు జాకీర్ హుస్సేన్ ఇక లేరు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

వహ్ తాజ్ అంటూ ఇండియాన్ ఆడియన్స్ కు బాగా గుర్తుండిపయిన భారతీయ తబలా దిగ్గజం, మల్టీ టాలెంటెడ్ జాకీర్ హుస్సేన్(Zakir Hussain) మరణించారు. ఆయన 73 ఏళ్ల వయస్సులో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ.. విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. హుస్సేన్ చాలా కాలంగా గుండె సంబంధిత సమస్యల తో బాధపడతున్నారు. ఈ కారణంగా శాన్ ఫ్రాన్సిస్కో లని ఆసుపత్రిలో ఆయన చేరారు. రక్తపోటు సమస్య ఎక్కువ అవ్వడంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దాంతో ఐసియులో ఉంచి ట్రీట్మెంట్ అందించారు. పరిస్తితి విషమించడంతో జాకిర్ కన్నుమూశారు.

జాకీర్ హుసేన్ మరణ వార్తతో సంగీత ప్రియులు దుఃఖంలో మునిగిపోయింది. , ప్రపంచవ్యాప్తంగా ఆయన మరణంతో సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.

మార్చి 9, 1951న ముంబైలోని మహిమ్‌లో తబలా మాస్టర్స్ అల్లా రఖా - బావి బేగం దంపతులకు జన్మించిన జాకీర్‌కు చిన్న వయస్సునుంచే సంగీత సాధన చేయడం స్టార్ట్ చేశారు. మూడేళ్లకే మృదంగం నేర్చుకున్న హుసేన్.. ఆతరువాత తబలా ప్రాక్టీస్ చేశారు. 12 ఏళ్ళు వచ్చేవరకూ కచేరీలు ఇచ్చే స్థాయికి ఎదిగారు జాకీర్ హుసేన్. కాలక్రమేణా హుస్సేన్ తనను తాను మాస్టర్‌గా నిలబెట్టుకున్నాడు, శాస్త్రీయ , ఫ్యూజన్ సంగీతంలో తన సాంకేతిక నైపుణ్యంతో అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ప్రోత్సహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

జాకీర్ హుస్సేన్ నుంచి వందల మంది సంగీత కళాకారులు బయటకు వచ్చారు. ఇక ఆయన టాలెంట్ ను వరించిన అవార్డ్ లు ఎన్నో. భారత ప్రభుత్వం జాకీర్ ను గౌరవిస్తూ.. 1988లోనే ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు అందించింది. ఆతరువాత 2002లో పద్మ భూషణ్.. రీసెంట్ గా 2023లో పద్మ విభూషణ్ కూడా అందుకున్నారు. 2024లో 66వ గ్రామీ అవార్డులలో పాటు.. మూడు గ్రామీలు గెలుచుకున్న మొదటి భారతీయ కళాకారుడిగా హుస్సేన్ నిలిచారు.

జాకీర్ హుస్సేన్ జీవితం సంగీతానికి మించిన శక్తి అని చెప్పవచ్చు. అతను అనేక మంది ప్రతిభావంతులైన సంగీతకారులకు మార్గదర్శకంగా నిలిచారు. జాకీర్ మరణంతో భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఒక శకం ముగిసింది, కానీ ఆయన వారసత్వం భవిష్యత్ సంగీతకారులకు స్ఫూర్తినిస్తుంది.

ehatv

ehatv

Next Story