నేడు పాట్నాలో విపక్షాల సమావేశం జరగనుంది. విపక్షాలను ఏకం చేసేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ సమావేశానికి పిలుపునిచ్చారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా 15 ప్రతిపక్ష పార్టీలకు చెందిన పెద్దలంతా పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
నేడు పాట్నా(Patna)లో విపక్షాల సమావేశం(Opposition Meeting) జరగనుంది. విపక్షాలను ఏకం చేసేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్(Nitish Kumar) ఈ సమావేశానికి పిలుపునిచ్చారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjuna Kharge), పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Benerjee), ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) సహా 15 ప్రతిపక్ష పార్టీలకు చెందిన పెద్దలంతా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే.. విపక్షాల సమావేశానికి ముందే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోతే ఏ సమయంలోనైనా సమావేశం నుంచి తప్పుకుంటామని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పాట్నాకు చేరుకుని పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో పాటు నితీష్ కుమార్‌ను కూడా కలిశారు. ఇతర ప్రతిపక్ష పార్టీల మాదిరిగానే కాంగ్రెస్ కూడా రాజ్యసభలో ఆర్డినెన్స్‌పై వ్యతిరేకతను ప్రకటించాలని ఆప్ కోరుతున్నట్లు జేడీయూ వర్గాలు తెలిపాయి.
ప్రతిపక్షాల ఐక్యతకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అతిపెద్ద అడ్డంకి అని లోక్‌సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు అధిరంజన్ చౌదరి(Adhir Ranjan Chowdhury) అభివర్ణించారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ హింసకు పాల్పడి కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తోందని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో సీపీఐ(ఎం)-కాంగ్రెస్ పొత్తుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మమత.. కాంగ్రెస్‌కు సహకరించబోమని ప్రకటించారు. అయితే కాంగ్రెస్, మమత మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) కూడా గురువారం సాయంత్రం పాట్నా చేరుకున్నారు.
ఒక కుటుంబంలా కలిసి బీజేపీతో పోరాడుతామని మమత అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో(Loksabha Elections) బీజేపీని అధికారం నుంచి తప్పించేలా చూస్తామని తెలిపారు.
మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Admi Party), ఇతర పార్టీల మధ్య పోస్టర్ వార్(Poster War) మొదలైంది. బీహార్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ పేరుతో పోస్టర్లు వెలిశాయి. ఇందులో అరవింద్ కేజ్రీవాల్‌ను తదుపరి ప్రధాని(Next PM)గా అభివర్ణించగా, నితీష్ కుమార్ నరేంద్ర మోదీకి నమ్మకస్తుడు అని దుయ్యబట్టారు.
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై రాజ్యసభలో విపక్షాల ఐక్యతను కూడగట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీతో సహా పలు ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలపై కేంద్ర సంస్థలు తీసుకున్న చర్యలపైనా సమావేశంలో చర్చించనున్నారు. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ ఇంకా ఏమీ మాట్లాడకపోవడం గమనార్హం.
దేశంలో ఎమర్జెన్సీ విధించి, జేపీని అరెస్టు చేసి జైల్లో పెట్టి, ప్రజాస్వామ్యాన్ని హతమార్చిన, పత్రికా స్వేచ్ఛను అడ్డుకున్న వారిని ఈ భూమి ఎప్పటికీ అంగీకరించదని బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోదీ(Susheel Kumar Modi) అన్నారు. నిజానికి ప్రజాస్వామ్యం ప్రమాదంలో లేదని, ఐక్యతగా ఉన్న ప్రతిపక్ష పార్టీల కుటుంబం ప్రమాదంలో ఉందని మోదీ అన్నారు.
బీఎస్పీ అధినేత్రి మాయావతి(Mayawati) మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను దృష్టిలో ఉంచుకుని.. ఇలాంటి ప్రయత్నం చేసే ముందు ప్రజల్లో విశ్వాసం నింపేందుకు ఈ పార్టీలు తమ సొంత ఇంటిని చూసుకుని ఉంటే బాగుండేదని అన్నారు. బహుజన సమాజ సంక్షేమం, రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయడం కోసం కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) వంటి పార్టీలు పనిచేయలేవని అన్నారు.
రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD) అధ్యక్షుడు జయంత్ చౌదరి(Jayanth Chowdary).. నితీష్ చేపడుతున్న చొరవకు మద్దతివ్వాలని, విపక్షాల ఐక్యత అవసరమని ప్రకటించారు.