దేశంలో జమిలి ఎన్నికలు(Jamili elections) ఇప్పట్లో నిర్వహించడం అసాధ్యమని లా కమిషన్(Law Commission) అభిప్రాయపడింది. వన్ నేషన్-వన్ ఎలెక్షన్(One Nation One Election) స్లోగన్‌తో కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం జలిమి ఎన్నికలకు ప్రణాళికలను రచించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జమిలి ఎన్నికలు నిర్వహించడం కష్టమని లా కమిషన్ తేల్చేసింది. దీంతో ప్రతిసారిలాగే ఈసారి కూడా ఎన్నికలు జరగనున్నాయి.
దేశంలో జమిలి ఎన్నికలు(Jamili elections) ఇప్పట్లో నిర్వహించడం అసాధ్యమని లా కమిషన్(Law Commission) అభిప్రాయపడింది. వన్ నేషన్-వన్ ఎలెక్షన్(One Nation One Election) స్లోగన్‌తో కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం జలిమి ఎన్నికలకు ప్రణాళికలను రచించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జమిలి ఎన్నికలు నిర్వహించడం కష్టమని లా కమిషన్ తేల్చేసింది. దీంతో ప్రతిసారిలాగే ఈసారి కూడా ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే, 2024లో లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని లా కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది.ప్రస్తుతం అధికరణలు సవరించకుండా ఎన్నికలను నిర్వహించలేమని తెలిపింది. 2029 నుంచి లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేలా ఓ ఫార్ములా రూపొందిస్తున్నట్లు లా కమిషన్ స్పష్టం చేసింది. వీటిపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ కసరత్తు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.జమిలి ఎన్నికలపై కసరత్తు ఇంకా జరుగుతున్నందున నివేదిక పనులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. దేశంలో జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణలను ఈ నివేదిక ప్రభుత్వానికి సూచిస్తుందని తెలిపారు. జమిలి ఎన్నికలపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని కమిషన్ తెలిపింది.