ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) మథురకు(Madhura) దగ్గరలోనే జస్ట్‌ ఓ 42 కిలో మీటర్ల దూరంలో బర్సన(Barsana) అనే ఊరుంది. ఊరంటే ఊరు కాదు కానీ పెద్ద పట్టణమే! శ్రీకృష్ణుడి(Sri krishna) ప్రియురాలు రాధ(Radha rani) జన్మించిన ప్రాంతంగా భావిస్తారు స్థానికులు. ఇక్కడ ప్రతి పురుషుడూ కృష్ణుడిగా, ప్రతి స్త్రీ రాధగా భావించుకుంటారు. ఇక్కడ హోలీ పండుగ(Holi festival) విచిత్రంగా, విభిన్నంగా జరుగుతుంటుంది.

ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) మథురకు(Madhura) దగ్గరలోనే జస్ట్‌ ఓ 42 కిలో మీటర్ల దూరంలో బర్సన(Barsana) అనే ఊరుంది. ఊరంటే ఊరు కాదు కానీ పెద్ద పట్టణమే! శ్రీకృష్ణుడి(Sri krishna) ప్రియురాలు రాధ(Radha rani) జన్మించిన ప్రాంతంగా భావిస్తారు స్థానికులు. ఇక్కడ ప్రతి పురుషుడూ కృష్ణుడిగా, ప్రతి స్త్రీ రాధగా భావించుకుంటారు. ఇక్కడ హోలీ పండుగ(Holi festival) విచిత్రంగా, విభిన్నంగా జరుగుతుంటుంది. పండుగ రోజున స్త్రీలు కర్రలు పుచ్చుకుని పురుషుల వెంటపడతారు. వెంటపడటమే కాదు కర్రలతో కొడతారు. మగవాళ్లు పాపం ఆ కర్ర దెబ్బల నుంచి తప్పించుకోడానికి డాలును అడ్డుపెట్టుకుంటారు. ఈ వేడుకను లఠ్‌మార్‌ హోలీ(Lathmar Holi) అంటారు. లఠ్‌ అంటే లాఠీ అన్నమాట. మార్‌ అంటే కొట్టడం. ఈ కొట్టడాలు, డాలుతో అడ్డుకోవడాలు అన్నీ సరదా కోసమే! అసలీ సరదా వెనుక ఓ పురాణగాధ ఉంది. చిన్ని కృష్ణుడు ఎంత అల్లరివాడో తెలుసుగా..! ఓనాడు రాధ గ్రామానికి వెళ్లి అక్కడ రాధతో పాటు ఆమె స్నేహితురాళ్లను ఆటపట్టించాడట! అప్పటికే వెన్నదొంగ అల్లరితో సతమతమైన బర్సానా మహిళలు కర్రలతో బాలకృష్ణుడి వెంట పడ్డారట. కొట్టడానికి అనుకునేరు. చిన్ని కృష్ణుడిని లాలించడానికి! అప్పట్నుంచి ఈ పండుగను ఇలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఇప్పటికీ పక్కనే ఉన్న కృష్ణుడి గ్రామం నంద్‌గావ్‌(Nandgav) నుంచి మగవాళ్లు హోలీ ఆడేందుకు బర్సానాకు వస్తారు. రెచ్చగొట్టే పాటలు పాడుతూ మహిళలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. ఆ వెంటనే ఆడవాళ్ల చేత లాఠీ దెబ్బలు తింటారు. ఆడవాళ్లు కూడా చాలా జాగ్రత్తగా డాలు మీదనే కర్ర దెబ్బలు వేస్తారు కానీ పొరపాటున కూడా మగవాళ్లను కొట్టరు. గమ్మత్తేమిటంటే బర్సానా అత్తగార్లు తమ కోడళ్లకు హోలీకి నెల రోజుల ముందు నుంచి పౌష్టిక ఆహారం పెడతారు! ఎందుకూ అంటే మగవాళ్లను బాగా కొట్టేందుకు! ఇక్కడ కొట్టడమంటే తమ ప్రేమను వ్యక్తపర్చడమే గానీ మరోటి కాదని గ్రామస్తులు నవ్వుతూ చెబుతారు.

Updated On 23 March 2024 4:21 AM GMT
Ehatv

Ehatv

Next Story