బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక పన్నుల విషయంలో జరిగిన కీలక సవరింపులు ఏప్రిల్ 1 వ తేదీ నుండి అమలు కాబోతున్నాయి . ఆదాయపు పన్నుకు సంబంధించి నూతన పన్ను విధానం 2023-24 వచ్చే నెలతో ప్రారంభం కాబోతుంది .

బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక పన్నుల విషయంలో జరిగిన కీలక సవరింపులు ఏప్రిల్ 1 వ తేదీ నుండి అమలు కాబోతున్నాయి . ఆదాయపు పన్నుకు సంబంధించి నూతన పన్ను విధానం 2023-24 వచ్చే నెలతో ప్రారంభం కాబోతుంది .

నూతన పన్ను విధానం ప్రకారం జీతం పొందే ఉద్యోగులు, పెన్షనర్లు వార్షిక ఆదాయంరూ. 7.5 లక్షల లో పు ఉన్నవాళ్లు ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించనవసరం లేదు అని కేంద్రప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో తెలిపింది . మాములుగా ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 3 లక్షలు దాటితే పన్ను విధిస్తారు.ఈ సరి దేన్నీ 7 లక్షల వరకు పెంచటం తో చిన్న ఉద్యోగులకు పన్ను విష్యం ఊరట లభించినట్లే . జీతం అందుకునే ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం 2023 కొత్త బడ్జెట్‌లో రూ. 50 వేల స్టాండర్డ్ డిడక్షన్‌ను పొడిగించింది.
ఇంతకు ముందు స్టాండర్డ్ డిడక్షన్ పాత ఆదాయపు పన్ను విధానంలో మాత్రమే అందుబాటులో ఉండేది.

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. సెక్షన్ 87ఏ కింద రాయితీ కేవలం దేశంలో నివాసం ఉంటున్న వారికి మాత్రమే వర్తిస్తుంది.
ఎన్నారైలు, హిందూ అవిభక్త కుటుంబాలు, సంస్థలు ఈ పన్ను రాయితీ వర్తించదు అని గమనించాలి . అయితే రూ.7.5 లక్షల వరకు ఆదాయం ఉన్నా కూడా కొత్త పన్ను విధానంలో రిబేట్, తగ్గింపులను క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం ఉండదు అని గమనించాలి .

ఇది ఇలా ఉండగా ఏ నెలాఖరు లోపు కొన్ని విషయాల్లో మార్పులు చేయకుంటే నష్టం తప్పదు అని కేంద్రం స్పష్టం చేసింది . కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు చేయాల్సిన పనుల్లో ముఖ్యంగా పాన్ ఆధార్ లింకింగ్‌, పన్ను ప్రణాళిక లాంటికొన్ని ముఖ్యమైన పనులను చేయకుంటే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్రం గడువు తేదీని మార్చ్ 31 గా ప్రకటించటం జరిగింది .

Updated On 17 March 2023 4:46 AM GMT
Ehatv

Ehatv

Next Story