అయోధ్య రామమందిరంలో బాలరాముడికి ప్రాణ(Ram Lalla) ప్రతిష్ట చేసిన ప్రధాన పూజారి ఆచార్య(Priest) లక్ష్మీకాంత్(Lakshmikanth) దీక్షిత్ ఈ రోజు ఉదయం కన్నుమూశారు
అయోధ్య రామమందిరంలో బాలరాముడికి ప్రాణ(Ram Lalla) ప్రతిష్ట చేసిన ప్రధాన పూజారి ఆచార్య(Priest) లక్ష్మీకాంత్(Lakshmikanth) దీక్షిత్ ఈ రోజు ఉదయం కన్నుమూశారు(dimised). 86 ఏళ్ల లక్ష్మీకాంత్ దీక్షిత్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారణాసిలోని గంగానది తీరంలో ఉన్న మణికర్ణిక ఘాటలో అంత్యక్రియులు నిర్వహించనున్నారు. ఈ ఏడాది జనవరి 22 వ తేదీన అయోధ్యలో రామ్‌లల్లాను ప్రతిష్టించారు. ఆ సందర్భంగా నిర్వహించిన పూజలకు లక్ష్మీకాంత్ దీక్షిత్ నాయకత్వం వహించారు. వీరి పూర్వీకులది మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా. కొన్నేళ్ల కిందట వారణాసికి వలసవచ్చారు. కొన్ని తరాలుగా వారణాసిలోనే నివసిస్తున్నారు. లక్ష్మీకాంత్ దీక్షిత్ మృతి పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. లక్ష్మీకాంత్ దీక్షిత్ గొప్ప పండితుడని, బాలరాముడి ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్న ఆయన మనల్ని వదిలివెళ్లడం దురదృష్టకరమని, ఆధ్యాత్మిక, సాహితీ ప్రపంచానికి తీరని లోటు అని యోగి అన్నారు.