పాకిస్తాన్‌కు(Pakistan) కష్టాల మీద కష్టాలు వచ్చిపడుతున్నాయి. లేటెస్ట్‌గా ఆ దేశంలో న్యుమోనియా(Pneumonia) స్వైరవిహారం చేస్తున్నది. ఈ ఏడాది ఆరంభం నుంచే ఆ వ్యాధి వ్యాప్తి మొదలయ్యింది. ఇప్పటి వరకు దాదాపు పది వేలకు పైగా న్యుమోనియా కేసులు నమోదయ్యాయి.

పాకిస్తాన్‌కు(Pakistam) కష్టాల మీద కష్టాలు వచ్చిపడుతున్నాయి. లేటెస్ట్‌గా ఆ దేశంలో న్యుమోనియా(Pneumonia) స్వైరవిహారం చేస్తున్నది. ఈ ఏడాది ఆరంభం నుంచే ఆ వ్యాధి వ్యాప్తి మొదలయ్యింది. ఇప్పటి వరకు దాదాపు పది వేలకు పైగా న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. 20 రోజుల్లోనే న్యుమోనియా కారణంగా పంజాబ్‌(Punjab) ప్రావిన్స్‌లో 200 మందికిపైగా చిన్నారులు చనిపోయారు. వీరంతా అయిదేళ్లలోపు పిల్లలు కావడం విషాదం. పంజాబ్‌ ప్రావిన్స్‌ రాజధాని లాహోర్‌లోనే(Lahore) 47 మంది పిల్లలు చనిపోయారు. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకోవడం వల్లనే ఈ మరణాలు సంభవించినట్టు పంజాబ్‌ ప్రభుత్వం చెప్పింది. పోషకాహారలోపంతోనే ఎక్కవ మంది చనిపోతున్నారని, వీరు న్యుమోనియా వ్యాక్సిన్‌ కూడా తీసుకోలేదని తెలిపింది. గత ఏడాది ఇదే సమయంలో ఇదే పంజాబ్‌ ప్రావిన్స్‌లో న్యుమోనియా కారణంగా సుమారు వెయ్యి మంది చిన్నారులు చనిపోయారు. ఇదిలా ఉంటే శీతల వాతావరణ పరిస్థితుల కారణంగా జనవరి 31వరకు పంజాబ్ ప్రావిన్సులో పాఠశాలలు ఉదయం తెరవకూడదని ప్రభుత్వం ఆదేశించింది.

Updated On 27 Jan 2024 2:24 AM GMT
Ehatv

Ehatv

Next Story