Kala Jathedi : గ్యాంగ్‌స్టర్ సందీప్‌తో లేడి గ్యాంగ్‌స్టర్ అనురాధ మళ్లీ పెళ్లి...
సందీప్(Sandeep) అలియాస్ కాలా జాతేడి(Kala Jathedi)- అనురాధ ఛౌదరి(Anuradha Choudhary) అలియాస్ మేడమ్ మింజ్(Madam Minz) పెళ్లి ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. వీరేమీ సెలెబ్రిటీలు కాదుగా! ఎందుకింత చర్చ అంటే.. వారిద్దరు సెలబ్రిటీల కంటే ఎక్కువే! వరుడు పలు నేరాలతో సంబంధమున్న గ్యాంగ్‌స్టర్(Gangster). వరుడుకి ఏ మాత్రం తీసిపోని వధువేమో లేడి గ్యాంగ్‌స్టర్. జోడి బేషుగ్గా కుదిరింది. వీరి పెళ్లికి కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. సందీప్‌ది హర్యానా. అనురాధది రాజస్థాన్.. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ నెల 12వ తేదీన హర్యానాలోని సోనిపట్‌లో ఒక్కటికాబోతున్నది. అనురాధ ఇప్పటికే బెయిల్‌పై విడుదయ్యారు.
సందీప్(Sandeep) అలియాస్ కాలా జాతేడి(Kala Jathedi)- అనురాధ ఛౌదరి(Anuradha Choudhary) అలియాస్ మేడమ్ మింజ్(Madam Minz) పెళ్లి ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. వీరేమీ సెలెబ్రిటీలు కాదుగా! ఎందుకింత చర్చ అంటే.. వారిద్దరు సెలబ్రిటీల కంటే ఎక్కువే! వరుడు పలు నేరాలతో సంబంధమున్న గ్యాంగ్‌స్టర్(Gangster). వరుడుకి ఏ మాత్రం తీసిపోని వధువేమో లేడి గ్యాంగ్‌స్టర్. జోడి బేషుగ్గా కుదిరింది. వీరి పెళ్లికి కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. సందీప్‌ది హర్యానా. అనురాధది రాజస్థాన్.. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ నెల 12వ తేదీన హర్యానాలోని సోనిపట్‌లో ఒక్కటికాబోతున్నది. అనురాధ ఇప్పటికే బెయిల్‌పై విడుదయ్యారు. పెళ్లి కోసం సందీప్‌కు కేవలం ఆరు గంటల పెరోల్‌ను కోర్టు మంజూరు చేసింది. అన్నట్టు వీరి వెడ్డింగ్ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో(Social media) తెగ చక్కర్లు కొడుతోంది.
అనురాధ ఉన్నత విద్యావంతురాలు. ఎంబీఏ చదివిన తర్వాత ఆమె బ్యాంక్‌లో ఉద్యోగం కూడా చేశారు. 2007లో దీపక్ మింజ్‌ను పెళ్లి చేసుకున్నారు. 2013లో భర్తకు విడాకులు ఇచ్చారు. మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్న అనురాధ గ్యాంగ్‌స్టర్ ఆనంద్‌పాల్ సింగ్‌తో చేతులు కలిపారు. 2017లో రాజస్థాన్‌లోని చురులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆనంద్‌పాల్ సింగ్ చనిపోయాడు. అనురాధపై చాలా కేసులున్నాయి. రాజస్థాన్, ఢిల్లీలో మనీలాండరింగ్(Money laundering), కిడ్నాప్, బెదిరింపులు, అక్రమ ఆయుధాలు.. ఇలా ఆరు కేసులకు పైగా ఉన్నాయి. ఆమెను పట్టిచ్చిన వారికి పది వేల రూపాయల రివార్డు కూడా ఉంది. ఇక పెళ్లికొడుకు సందీప్ విషయానికి వస్తే హర్యానా సోనిపట్‌లోని జాతేడి గ్రామానికి చెందిన ఇతడు ఐటీఐ చదివాడు. చిన్నప్పుడే చెడు సహవాసం పట్టాడు. బాల్యం నుంచి నేరాలు చేయడం అలవాటయ్యింది ఇతడికి! 2004లో తన మిత్రులతో కలిసి ఢిల్లీకి వచ్చాడు. అక్కడే ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ దొంగిలించడానికి ప్రయత్నించి దొరికిపోయాడు. ఇక అప్పట్నంచు రాటుదేలిపోయాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు దగ్గరయ్యాడు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో 12కు పైగా కేసులు సందీప్‌పై ఉన్నాయి. దోపిడీలు, హత్యలు, హత్యా ప్రయత్నాలు, అక్రమ ఆయుధాలు కేసులలో ఇతడు నిందితుడు. ఇతగాడిపై ఏడు లక్షల రూపాయల రివార్డు ఉంది. 2021, జూలై 30వ తేదీన అనురాధతో కలిసి సందీప్ ఓ దాబా దగ్గర ఉండగా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అంతకు ఏడాది ముందు నుంచే వీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మొదటిసారి వీరిద్దరు కలుసుకున్నారు. ఆనంద్‌పాల్ సోదరుడు విక్కీసింగ్ ద్వారా ఏర్పడిన పరిచయం తర్వాత ప్రేమగా మారింది. ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. గుళ్లో పెళ్లి చేసుకున్న వీరు ఇండోర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం చేశారు. తర్వాత తమ బీహార్‌కు షిఫ్టయ్యారు. 2021 జూన్‌లో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు, తర్వాత మహారాష్ట్రలోని షిరిడీకి వెళ్లారు. తదనంతరం మధురను సందర్శించారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు వెళ్లివచ్చిన తర్వాత ఢిల్లీ పోలీసులకు దొరికారు. బెయిల్‌పై రిలీజైన అనురాధ జైలులో ఉన్న సందీప్‌ను తరచూ కలుసుకునేవారు. ప్రస్తుతం ఆమె సోనిపట్‌లోని సందీప్ తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారు.