మన కల్యాణలక్ష్మీ పథకంలాగే ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) కూడా ఓ చిన్న పథకం ఉంది. ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద కొత్త జంటలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం 51 వేల రూపాయలు కానుకగా ఇస్తోంది. తాజాగా ఝాన్సీలో(Jhansi) సామూహిక వివాహ వేడుక జరిగింది. టైమ్‌కు పెళ్లికొడుకు రాకపోయేసరికి బావనే పెళ్లి చేసుకుంది ఓ యువతి.

Uttar Pardesh
మన కల్యాణలక్ష్మీ పథకంలాగే ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) కూడా ఓ చిన్న పథకం ఉంది. ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద కొత్త జంటలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం 51 వేల రూపాయలు కానుకగా ఇస్తోంది. తాజాగా ఝాన్సీలో(Jhansi) సామూహిక వివాహ వేడుక(Mass wedding ceremony) జరిగింది. టైమ్‌కు పెళ్లికొడుకు రాకపోయేసరికి బావనే పెళ్లి చేసుకుంది ఓ యువతి. 51 వేల రూపాయల కోసం ఆమె ఇలా చేసిందట! ఝాన్సీలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో(Jhansi Polytechnic college) జరిగిన సీఎం సామూహిక వివాహ కార్యక్రమంలో 132 జంటలు ఒక్కటయ్యాయి. పెళ్లి చేసుకోవడానికి దూర ప్రాంతాల నుంచి కూడా వధూవరులు రావడం విశేషం. ఝాన్సీ సమీప బామౌర్‌కు చెందిన ఖుషీ అనే అమ్మాయికి మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌కు చెందిన వృష్ భానుతో పెళ్లి ఫిక్స్ అయ్యింది. వీరిద్దరి పేరుతో 36 నంబర్ రిజిస్ట్రేషన్ నమోదయ్యింది. పెళ్లి పీటలపై ఖుషీ పక్కన వృష్ భాను కాకుండా మరో వ్యక్తి కనిపించాడు. విషయమేమిటో కనుక్కుంటే పెళ్లి కొడుకు టైమ్‌కు రాలేదనీ, పెద్దలు చెబితే తాను కూర్చున్నాననీ డూప్లికేట్ వరుడు చెప్పుకొచ్చాడు. ఖుషికి వరుసకు బావ అయ్యే అతడికి ఆల్‌రెడీ పెళ్లి అయ్యిందని తెలిసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా ఉందంటున్నారు. ఈ తతంగంలో ఎంతమంది నకిలీ పెళ్లి కొడుకులున్నారో తెసుకోవడానికి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి లలితా యాదవ్(Lalitha) విచారణకు ఆదేశించారు.
