బీజేపీ(BJP) నాయకురాలు ఖుష్బూ సుందర్‌(Khushboo Sundar) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తమిళనాడులోని దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆమె తన సోషల్‌ మీడియా(Social media) పేజీలో చేరి భాష(Cheri Language) గురించి కామెంట్‌ చేశారు.

బీజేపీ(BJP) నాయకురాలు ఖుష్బూ సుందర్‌(Khushboo Sundar) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తమిళనాడులోని దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆమె తన సోషల్‌ మీడియా(Social media) పేజీలో చేరి భాష(Cheri Language) గురించి కామెంట్‌ చేశారు. దాన్ని ఖండిస్తూ తమిళనాడులో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దళిత విభాగం నిరసన చేపట్టింది. ఖుష్బూ ఫ్లెక్సీని చీపుర్లతో కొట్టింది. ఇటీవల నటి త్రిషపై(Trisha) నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌(Mansoor Ali Khan) అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలు పలువురు ఖండించడం తెలిసిన విషయాలే! మన్సూర్‌ అలీ ఖాన్‌ వ్యాఖ్యలను తప్పుపట్టిన వారిలో ఖుష్బూ కూడా ఉన్నారు. అయితే ఖష్బూ రియాక్టవ్వడాన్ని డీఎంకే నేత షణ్ముగం చిన్నరాజ తప్పుపట్టారు. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగిస్తుంటే బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఈ వ్యాఖ్యలకు ఖుష్బూ కౌంటర్‌ ఇస్తూ 'మహిళలను కించపరిచే రీతిలో మాట్లాడటం మంచిది కాదు. మీలాంటి చేరి భాష నాకు రాదు' అంటూ కామెంట్‌ చేశారు. చేరి భాష గురించి ఖుష్బూ కామెంట్‌ చేయడాన్ని తమిళనాడు ఎస్సీలు వ్యతిరేకిస్తున్నారు. చేరి అనే ప‌దం ద‌ళిత మైనార్టీల‌ను సూచిస్తుంద‌ని, ఆ ప‌దాన్ని వాడ‌డం అంటే ద‌ళితుల్ని అవమానించ‌డ‌మే అవుతుంద‌ని దళిత సంఘాలు అంటున్నాయి

Updated On 28 Nov 2023 5:12 AM GMT
Ehatv

Ehatv

Next Story