హిమాచల్‌ప్రదేశ్‌లోని(Himachal Pradesh) కుల్లుమనాలీలో(Kullu manali) జరిగే విజయదశమి వేడుకలు(Dasara celebration) ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిపొందాయి.

హిమాచల్‌ప్రదేశ్‌లోని(Himachal Pradesh) కుల్లుమనాలీలో(Kullu manali) జరిగే విజయదశమి వేడుకలు(Dasara celebration) ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిపొందాయి. ఇదో అంతర్జాతీయ పండుగగా(International festival) మారింది.. కుల్లు లోయలో ఉన్న థాల్పూర్‌ మైదానంలో(Thalpur grounds) జరిగే దసరా ఉత్సవాన్ని వీక్షించడానికి ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు అయిదు లక్షల మంది పర్యాటకులు(Tourist) వస్తుంటారు. రాష్ర్ట ప్రభుత్వమే ఈ ఉత్సవాలను నిర్వహిస్తుంటుంది. ఈ వేడుకలకు మూడు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది.. తొమ్మిది రోజుల పాటు జరిగే వేడుకలు రఘునాథస్వామి రథోత్సవంతో ప్రారంభమవుతాయి. ఇతర దేవదేవుళ్ల మూర్తులను కూడా రథంలోకి చేర్చి పట్టణమంతా ఊరేగిస్తారు. ప్రకృతి రమణీయతకు తోడు శోభాయమానమైన ఈ వేడుకలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. వారం రోజుల పాటు విందులు వినోదాలు.. ఆటపాటలతో కుల్లు మైదానం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. రాత్రుళ్లు జరిగే కళాకేంద్ర ఫెస్టివల్‌లో అనేక సాంస్కృతి కార్యక్రమాలు జరుగుతాయి. నవరాత్రులలో ఆరో రోజున గ్రామదేవతలందరూ ఒక్క చోట కొలువు తీరతారు. చివరి రోజున అమ్మవారికి బలులు కూడా ఇస్తారు. ఈ మెగా ఫెస్టివల్‌ కోసం సమీప గ్రామాల నుంచి దాదాపు మూడు వందల దేవతామూర్తులు కుల్లుకు తరలివస్తాయి.. పండుగ అనంతరం రఘునాథ విగ్రహాన్ని పెద్ద ఊరేగింపుతో యథాస్థానానికి చేరుస్తారు. అసలు మిగతా ప్రాంతాలలో జరిగే దసరా వేడుకలకు కుల్లులో జరిగే సంబరాలకు చాలా తేడా ఉంటుంది. దసరా ఉత్సవాల కోసం వచ్చిన వాళ్లు పనిలోపనిగా రఘునాథ్‌ ఆలయం, బశీశ్వర్‌ మహదేవ్‌ ఆలయం, తీర్థన్‌ వ్యాలీ, సుల్తాన్‌పూర్‌ ప్యాలెస్‌, ప్రశార్‌ సరస్సు, పండో డామ్‌, ఇలాంటి పర్యాటక ప్రదేశాలను కూడా తిలకిస్తారు.

Eha Tv

Eha Tv

Next Story