ముంబాయి మహానగరంలో ఎన్‌సీపీ(NCP) (అజిత్‌ పవార్‌ వర్గం) నాయకుడు బాబా సిద్ధిఖీని(Siddique) హత్య చేసిన లారెన్స్‌ బిష్ణోయ్‌(Lawrence bishnoi) గ్యాంగ్‌పై చర్చ జరుగుతోంది.

ముంబాయి మహానగరంలో ఎన్‌సీపీ(NCP) (అజిత్‌ పవార్‌ వర్గం) నాయకుడు బాబా సిద్ధిఖీని(Siddique) హత్య చేసిన లారెన్స్‌ బిష్ణోయ్‌(Lawrence bishnoi) గ్యాంగ్‌పై చర్చ జరుగుతోంది. లారెన్స్‌ బిష్ణోయ్‌ ఎవరనే ఆసక్తి పెరిగింది. ఇదిలా ఉంటే లారెన్స్‌ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్‌(Encounter) చేసిన వారికి కోటి రూపాయల రివార్డు(Reward) ఇస్తామంటూ క్షత్రియ కర్ణిసేన ప్రకటించింది. ఈ మేరకు క్షత్రియ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు రాజ్‌ షెకావత్‌(Raj shekawath) ఓ ప్రకటన చేశారు. లారెన్స్‌ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసు అధికారికి 1,11,11,111 రూపాయల రివార్డు ఇస్తామని చెప్పారు. ఆయన విడుదల చేసిన ఓ వీడియోలో మాట్లాడుతూ ‘‘లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే.. భద్రతా సిబ్బందికి మేము ప్రకటించిన రివార్డు అందజేస్తాం. లారెన్స్‌ బిష్ణోయ్‌ విషయంలో కేంద్రం, గుజరాత్‌ ప్రభ్వుం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అమర్ షహీద్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని హత్య చేసిన నిందితుల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ కూడా ఒకరు’’ అని చెప్పుకొచ్చారు. డిసెంబర్ 5, 2023న జైపూర్‌లో కొందరు ఆగంతకులు కర్ణిసేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిపై కాల్పులు జరిపి హత్య చేశారు. హత్య జరిగిన కాసేపటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యకు బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది. లారెన్స్‌ బిష్ణోయ్‌కు సంబంధించిన బలమైన క్రిమినల్ సిండికేట్ గ్యాంగ్‌ దేశవ్యాప్తంగా పని చేస్తుంది. పది నెలల కిందట సల్మాన్ ఖాన్ ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటనకు బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. సెప్టెంబరు 2023లో ఖలిస్తానీ సానుభూతిపరుడు సుఖా దునేకే హత్యకు కూడా ఈ గ్యాంగ్‌ బాధ్యత వహించింది. ఇండియాలోనే కాదు, కెనడాలోని ఏపీ ధిల్లాన్, గిప్పీ గరేవాల్ నివాసాల వెలుపల కూడా బిష్ణోయ్ గ్యాంగ్‌ సభ్యులు కాల్పులు జరిపారు. లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నారు.

Eha Tv

Eha Tv

Next Story