కూతురు పెళ్లి ఘనంగా చేయాలని ప్రతీ తండ్రికి ఉంటుంది. వైభవంగా వివాహం చేసి అత్తారింటికి పంపించాలని ఆశిస్తుంటారు. డబ్బున్నవారైతే ఇలాంటి సందర్భాలలో తమ దర్పాన్ని చాటుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ప్రతాప్‌గఢ్‌లో(Pratapgarh) జరిగిన సంఘటన ఇందుకు మంచి ఉదాహరణ! పట్టి తహసీల్ ఉపాధ్యాయపూర్ గ్రామానికి చెందిన కృపాశంకర్ తివారీ(Kripashankar Tiwari) తన కూతురు శివను సుల్తాన్‌పూర్‌లోని శంకర్‌గఢ్‌కు చెందిన సత్యప్రకాశ్ పాండే కుమారుడు సతీశ్ పాండేకు(Satish Pandey) ఇచ్చి పెళ్లి చేశాడు.
కూతురు పెళ్లి ఘనంగా చేయాలని ప్రతీ తండ్రికి ఉంటుంది. వైభవంగా వివాహం చేసి అత్తారింటికి పంపించాలని ఆశిస్తుంటారు. డబ్బున్నవారైతే ఇలాంటి సందర్భాలలో తమ దర్పాన్ని చాటుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ప్రతాప్‌గఢ్‌లో(Pratapgarh) జరిగిన సంఘటన ఇందుకు మంచి ఉదాహరణ! పట్టి తహసీల్ ఉపాధ్యాయపూర్ గ్రామానికి చెందిన కృపాశంకర్ తివారీ(Kripashankar Tiwari) తన కూతురు శివను సుల్తాన్‌పూర్‌లోని శంకర్‌గఢ్‌కు చెందిన సత్యప్రకాశ్ పాండే కుమారుడు సతీశ్ పాండేకు(Satish Pandey) ఇచ్చి పెళ్లి చేశాడు. వివాహ వేడుకను ఘనంగా జరిపించాడు. ప్రతాప్‌గఢ్‌లోని రాణిరామ్ ప్రియా గార్డెన్‌లో జరిగిన ఈ పెళ్లికి చాలా మంది అతిథులు వచ్చారు. తర్వాత కృపాశంకర్ తివారీ తన కూతురు శివను తన స్వగ్రామం ఉపాధ్యాయపూర్ నుండి హెలికాప్టర్‌లో(Helicopter) అత్తారింటికి పంపించారు. హెలికాప్టర్‌లో వధూవరులు కూర్చున్నారు. ఆ సమయంలో వీరిని చూసేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ముంబాయి నుంచి ప్రచురితమయ్యే అభ్యుదయ వాత్సల్యం అనే పత్రికకు కృపా శంకర్ తివారీ చీఫ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయన కొడుకు అలోక్ రంజన్ తివారీ ఎటర్నల్ కార్పొరేట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సీఈవో కమ్ మేనేజింగ్ డైరెక్టర్.