కోల్‌కతాలో(Kolkata) ట్రైనీ డాక్టర్‌పై(Junior Doctor) అత్యాచారం, హత్య కేసు(Murder case) దేశంలో సంచలనంగా మారింది.
కోల్‌కతాలో(Kolkata) ట్రైనీ డాక్టర్‌పై(Junior Doctor) అత్యాచారం, హత్య కేసు(Murder case) దేశంలో సంచలనంగా మారింది. ఆర్‌జీ కార్ ప్రభుత్వ ఆసుపత్రిలో(RG Kar Govt College and Hospital) విధుల్లో ఉన్నప్పుడు ఆమెపై అత్యాచారం జరిగింది. తర్వాత నిందితుడు ఆమెను హత్య చేశాడు. దీంతో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డాక్టర్లు, విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈసమయంలోనే నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంజయ్(Sanjay) తల్లి మాలతీ రాయ్ మాత్రం తన కొడుకు నిర్దోషి అని, ఈ నేరంతో అతడికి ఏ మాత్రం సంబంధం లేదని, పోలీసులు ఒత్తిడి చేయడం వల్లనే నేరాన్ని అంగీకరించాడని అంటున్నారు. పోలీసులు నిందితుడు ఉంటున్న ప్రాంతాలకు వెళ్లి స్థానికులతో మాట్లాడారు. బంధువులను ఆరా తీస్తున్నారు. నిందితుడికి ఆల్‌రెడీ నాలుగు పెళ్లిళ్లు(Four marriages) అయ్యాయని పోలీసుల విచారణలో తేలింది. అతడి ప్రవర్తన బాగోలేకపోడంతోనే ముగ్గురు భార్యలు అతడిని విడిచిపెట్టినట్టు తెలిసింది. లాస్టియర్ నాలుగో భార్య కేన్సర్‌తో చనిపోయారు. నిందితుడు తరచూ ఫుల్లుగా తాగేసి అర్ధరాత్రి ఇంటికి వచ్చేవాడని స్థానికులు చెప్పారు. ఇదిలా ఉంటే ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్‌ను పదవి నుంచి తొలగిస్తూ పశ్చిమ బెంగాల్ ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.