సంజయ్ రాయ్ ఎలాంటివాడంటే...!
కోల్‌కతా జూనియర్ డాక్టర్(Junior Doctor) హత్యాచార ఘటనలో(Rape case) ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌లో(Sanjay Roy) రాక్షస ప్రవృత్తి ఉందంటున్నారు. మంచివాడు కాదంటున్నారు. కోల్‌కతా పోలీసులు(Kolkata police) కూడా అతడి గురించి కొంత సమాచారం సేకరించారు. హత్యాచార ఘటన జరిగిన ఆగస్టు 8వ తేదీ రాత్రి సంజయ్‌రాయ్ కోల్‌కతాలోని సోనాగాచి రెడ్ లైట్ ఏరియాకు వెళ్లాడని పోలీసులు చెబుతున్నారు. తర్వాత అర్థరాత్రి అతడు ఆర్జీ కర్ హాస్పిటల్‌కు(RG Kar Hospital) వెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. హత్యాచారం జరిగిన ఆర్టీ హాస్పిటల్ సెమినార్ హాల్‌లో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ కేసులో సీబీఐ విచారణ వేగంగా సాగుతోంది. ఇదిలాఉంటే సంజయ్ రాయ్‌పై ఆయన అత్త విస్తుపోయే వాస్తవాలు చెప్పారు. అతడు తన మాజీ భార్యను తీవ్రంగా కొట్టేవాడని, అలా తీవ్రంగా కొట్టడంవల్లే మూడు నెల గర్భిణి అయిన ఆమెకు గర్భస్రావం అయ్యిందని చెప్పారు.
సంజయ్ రాయ్ మంచివాడు కాదని, చాలా రాక్షసంగా ప్రవర్తించేవాడని ఆమె తెలిపారు. ఇంత మహా పాతకానికి పాల్పడిన సంజయ్‌ను ఉరితీయాలని ఆమె అంటున్నారు. మరోవైపు ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్(Sandeep gosh), నిందితుడు సంజయ్ రాయ్, కోల్‌కతా పోలీస్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ అనూప్ దత్తా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించడంతో సీబీఐ అధికారులు వారిని కూడా ప్రశ్నిస్తున్నారు.