దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం-హత్య ఘటనలో ఈ రోజు తీర్పు వెల్లడించింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం-హత్య ఘటనలో ఈ రోజు తీర్పు వెల్లడించింది. స్థానిక సీల్దా సెషన్స్ కోర్టు నిందితుడు సంజయ్ రాయ్‌ని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి..‘‘నేను అన్ని ఆధారాలను, సాక్షులను విచారించాను, అందరి వాదనలను విన్నాను. వీటిన్ని తర్వాత నువ్వు నేరం చేసినట్లు రుజువైంది. నువ్వు దోషివి, నువ్వు తప్పకుండా శిక్షించబడాలి’’ అని అన్నారు. అయితే, తీర్పు సమయంలో తాను దోషిని కాదని, తనను ‘‘ఇరికించారని’’ సంజయ్ రాయ్ వాదించారు. ‘‘నేను ఈ నేరం చేయలేదు. ఇది చేసిన వారిని ఎందుకు విడిచిపెడుతున్నారు..?’’ అని అడిగారు. ఆగస్టు 9న ఈ దారుణమైన హత్య, అత్యాచారం జరిగింది. నేరం జరిగిన 160 రోజుల తర్వాత తీర్పు వెలువడింది. కాగా, ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సక్రమంగా విచారించలేదని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసును సీబీఐ సక్రమంగా విచారించి ఉంటే మరికొంత మందిని అరెస్టు చేసి దోషులుగా నిర్ధారించి ఉండేవారని పేర్కొన్నారు.

ehatv

ehatv

Next Story