పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో సోమవారం కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. రైలు కోల్‌కతాలోని సీల్దా స్టేషన్‌కు వెళుతుండగా, సిలిగురిలోని రంగపాణి ప్రాంతంలో వెనుక నుండి గూడ్స్ రైలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సిలిగురిలో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురైందని తెలుసుకుని ప్రజలు టెన్షన్ పడుతూ ఉన్నారు. రైలు న్యూ జల్‌పైగురి స్టేషన్‌ నుంచి కోల్‌కతాలోని సీల్దా స్టేషన్‌కు వెళ్తుండగా వెనుక నుంచి గూడ్స్‌ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు.

ఈ ప్రమాదంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. జిల్లా మేజిస్ట్రేట్, వైద్యులు, అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని చెప్పారు. "ఇప్పుడే, డార్జిలింగ్ జిల్లాలోని ఫన్‌సిదేవా ప్రాంతంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాను. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టినట్లు సమాచారం. DM, SP, వైద్యులు, అంబులెన్స్‌లు, విపత్తు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రెస్క్యూ, రికవరీ, వైద్య సహాయం అందిస్తున్నారు" అని ఆమె ట్వీట్ చేసింది. ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే (NFR)కి చెందిన అత్యవసర వైద్య బృందం ప్రమాద స్థలానికి చేరుకుంది. ఈ ఘటనకి సంబంధించి సీల్దా స్టేషన్‌లో హెల్ప్‌డెస్క్ కూడా ప్రారంభించారు.


Eha Tv

Eha Tv

Next Story