కేరళలో(Kerala) వెలుగు చూసిన అంతర్జాతీయ కిడ్ని రాకెట్‌(International Kidney Racket) అసలు సూత్రధారి హైదరాబాద్‌కు(Hyderabad) చెందిన డాక్టర్ అని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌ నుంచి కొచ్చి(Kochi) మీదుగా ఇరాన్‌ కేంద్రంగా ఈ కిడ్నీ రాకెట్‌ నడిచింది. కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడిన సబిత్‌ నాసిర్‌ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు బ్రోకర్లు ఈ రాకెట్‌ను నడిపించారు.

కేరళలో(Kerala) వెలుగు చూసిన అంతర్జాతీయ కిడ్ని రాకెట్‌(International Kidney Racket) అసలు సూత్రధారి హైదరాబాద్‌కు(Hyderabad) చెందిన డాక్టర్ అని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌ నుంచి కొచ్చి(Kochi) మీదుగా ఇరాన్‌ కేంద్రంగా ఈ కిడ్నీ రాకెట్‌ నడిచింది. కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడిన సబిత్‌ నాసిర్‌ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు బ్రోకర్లు ఈ రాకెట్‌ను నడిపించారు. ఇందులో ఓ డాక్టర్‌(Doctor) ఉన్నాడు. ఈ ముఠా ఏం చేస్తందటే.. హైదరాబాద్‌, బెంగళూరులకు చెందన పేద యువకులను మొదట గుర్తిస్తుంది. తర్వాత వారికి ఎన్నో ఆశలు చూపించి ఇరాన్‌కు తీసుకెళుతుంది. అక్కడ కిడ్నీలను తీసుకుని అమ్ముకుంటోంది. ఈ క్రమంలో కేరళలో తాజాగా ఓ యువకుడు చనిపోయాడు. కిడ్నీదానం పేరిట మోస జరిగిందని, ఒక ముఠా తమ కొడుకు ప్రాణాలు తీసిందని అతడి కుటుంబసభ్యులు కొచ్చి పోలీసులకు కంప్లయింట్ చేశారు. దీంతో విచారణ చేపట్టిన కొచ్చి పోలీసులు సబిత్‌ నాసిర్‌ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో పోలీసులకు దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయటపడ్డాయి.
పేద యువకులకు లక్ష్యంగా చేసుకుంటున్న ఈ ముఠా ఒక్కో కిడ్నీకి 20 లక్షల రూపాయలు ఇస్తామని వారికి ఆశ చూపుతూ ఇరాన్‌కు తీసుకెళుతుంది. అక్కడ కిడ్నీలు తీసుకుని వారిని తిరిగి ఇండియాకు తీసుకొస్తోంది. ఇక్కడికి వచ్చాక కేవలం ఆరు లక్షల రూపాయలే ఇస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ క్రమంలోనే కిడ్నీ ఇచ్చిన ఓ యువకుడు చనిపోవడంతో ఈ ముఠా అరాచకాలు వెలుగు చూశాయి. ముఠాలోని కీలక సభ్యుడు సబిత్‌ ఇరాన్‌ నుంచి కొచ్చి వచ్చాడు. గత ఆదివారం అతడిని అక్కడి విమానాశ్రయంలో కేరళ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం సబిత్‌ను అంగమాలి జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. సబిత్‌ ఈ వృత్తిలోకి రావడానికి హైదరాబాద్‌కు చెందిన డాక్టరే ప్రధాన కారణం. 2019లో ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తికి కిడ్నీ ఇప్పించడం ద్వారా హైదరాబాద్‌ వైద్యుడు, సబిత్‌ల మధ్య స్నేహం మొదలైంది. బెంగళూరు, హైదరాబాద్‌ల నుంచి 40 మంది యువకులను ఇరాన్‌ తీసుకెళ్లి.. వారి కిడ్నీలు విక్రయించినట్లు సబిత్‌ అంగీకరించాడు. ఇరాన్‌కే ఎందుకు తీసుకెళుతున్నారంటే అక్కడ రక్తసంబంధీకులు కాని వారు అవయవాలు దానం చేసేందుకు అనుమతి ఉంది కాబట్టిష్ట్ర

Updated On 24 May 2024 1:25 AM GMT
Ehatv

Ehatv

Next Story