ఏపీ ఎన్నికలపై(AP Election) సంచలన సర్వే వెల్లడించిన కేకే(KK Survey)..
ఏపీ ఎన్నికలపై(AP Election) సంచలన సర్వే వెల్లడించిన కేకే(KK Survey).. ఆయన చెప్పినట్లుగానే కూటమికి 160 సీట్లు వచ్చాయి. కేకే సర్వే నిజం కావడంతో కూటమి నేతలు అప్పట్లో అతనిని ఘనంగా సన్మానించారు. దీంతో హర్యానా ఎన్నికలపై(Haryna ELections) కూడా కేకే సర్వే నిర్వహించారు. హర్యానాలో 65కుపైగా సీట్లు కాంగ్రెస్ గెలవబోతుందని కేకే సర్వే చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే హర్యానాలో కూడా కేకే చెప్పింది నిజమవుతుందని అందరూ నమ్మారు. హర్యానాలో ఎన్నికల్లో బీజేపీ కనీసం పోటీ కూడా ఇవ్వదని.. బీజేపీ టైటానిక్ షిప్‌లాంటిదని కేకే చెప్పారు. హర్యానాలో ప్రతి మూడు నియోజకవర్గాల్లో బీజేపీ రెండింట ఓడిపోతుందని కేకే చెప్పారు.
అయితే ఫలితాలు చూస్తే మాత్రం హర్యానాపై కేకే అంచనాలు గాడి తప్పాయి. హర్యానా ప్రజల తీర్పును కేకే పసిగట్టలేకపోయారని తేలిపోయింది. ఆయన చెప్పినదానికంటే విభిన్న ఫలితాలు ఆ రాష్ట్రంలో వచ్చాయి. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టిందనే చెప్పాలి. మ్యాజిక్ ఫిగర్‌ను దాటి పోయింది బీజేపీకి. తొలుత కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందని అన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చింది. కానీ రానురాను బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. 48 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంటే 36 స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది. ఆరు స్థానాల్లో ఇతరులు ఉన్నారు. ఇక్కడ ఆప్ ఖాతా కూడా తెరవలేకపోయింది. కొండేటి కిరణ్ అంచనాలు హర్యానాలో అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.