తెలంగాణలో(Telangana) గత రెండు నెలలుగా లైట్ బీర్లకు(Light Beer) బాగా డిమాండ్ పెరిగిపోయింది. భానుడి ప్రతాపానికి తట్టుకోలేకపోతున్న మద్యం ప్రియులు బీర్లను తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. హైదరాబాద్‌లో డిమాండ్‌కు తగ్గట్టుగా బీరు ఉత్పత్తి కాకపోవడంతో పలు వైన్ షాపుల ముందు నో బీర్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా కె.ఎఫ్.లైట్ బీర్(KF Beer) దొరక్కపోవడంతో ఆ బ్రాండ్ ప్రియులు తీవ్ర నిరాశ, నిస్పృహలు వెల్లగక్కుతున్నారు. వేసవికాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి.
తెలంగాణలో(Telangana) గత రెండు నెలలుగా లైట్ బీర్లకు(Light Beer) బాగా డిమాండ్ పెరిగిపోయింది. భానుడి ప్రతాపానికి తట్టుకోలేకపోతున్న మద్యం ప్రియులు బీర్లను తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. హైదరాబాద్‌లో డిమాండ్‌కు తగ్గట్టుగా బీరు ఉత్పత్తి కాకపోవడంతో పలు వైన్ షాపుల ముందు నో బీర్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా కె.ఎఫ్.లైట్ బీర్(KF Beer) దొరక్కపోవడంతో ఆ బ్రాండ్ ప్రియులు తీవ్ర నిరాశ, నిస్పృహలు వెల్లగక్కుతున్నారు. వేసవికాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. మండే ఈ ఎండల్లో చల్లని బీరు తాగితే బావుంటుందని ఆశపడే బీరు ప్రియులకు నిరాశే ఎదురవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడింది. రాష్ట్రంలోని షాపులకు సంస్థ నుంచి సరఫరా అయ్యే బీర్ల కంటే కొనుగోలు ఎక్కువగా ఉండడం ఓ కారణంగా తెలుస్తోంది. 2023 మేలో 4 కోట్ల 23 లక్షల బీర్ల అమ్మకాలు జరిగాయి. అంటే రోజుకు 23 వేలకు పైగా బీర్లను విక్రయించారు.
అంతే కాకుండా బ్రేవరేజీలకు కార్పొరేషన్ సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో బీర్ల ఉత్పత్తిపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆరు బ్రూవరీల్లో రోజుకి 2.5 లక్షల కేసుల బీరును ఉత్పత్తి చేయొచ్చు. అయితే ప్రస్తుతం ఏర్పడిన ఆర్ధికపరమైన ఇబ్బందుల నేపథ్యంలో రోజుకి కేవలం 1.5 లక్షల కేసుల బీరు మాత్రమే తయారవుతోంది. దీనితో రాష్ట్రంలో బీర్ డిమాండ్ పెరిగింది. తాగునీరు కొరత కూడా ఇందుకు కారణమని చెప్తున్నారు. ముఖ్యంగా కేఎఫ్ లైట్ (K.F.Light Beer)కి అధిక డిమాండ్ ఉంటుంది. హార్డ్ బీర్లు లభ్యమవుతున్నా కానీ గత రెండు నెలలుగా కె.ఎఫ్.బీర్ దొరకడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా కింగ్ ఫిషర్ లైట్ బీర్లు(King Fisher Light Beers) దొరకడం లేదని బీరు ప్రియులు వాపోతున్నారు. అంతేకాకుండా మద్యం షాపుల సిబ్బందితో ఘర్షణకు దిగుతున్నారు. లైట్ బీర్లు లేక మందు బాబులు స్ట్రాంగ్ బీర్లు తాగేస్తున్నారు. ఇష్టం లేకున్నా లైట్ బీర్లు దొరక్క.. ఎండ వేడి తట్టుకోలేక స్ట్రాంగ్ బీర్లను లాగించేస్తున్నారు. ఎండకాలంలో బీర్ల కొరత ఏర్పడం సాధారణమే అయినా బీర్లకు ఎక్కువ గిరాకీ ఉంటుందని తెలిసినా స్టాక్ తెప్పించుకోలేదని మందు ప్రియులు మండి పడుతున్నారు. రిజర్వాయర్లలో నీటి లభ్యత లేకపోవడంతో బీర్ల తయారీ కేంద్రాలపై ప్రభావం పడిందని అంటున్నారు.
ఈ మధ్య కాలంలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభ్యం కావడం లేదని మందుబాబులు ఆందోళన కూడా చేపట్టారు. మంచిర్యాల జిల్లా తాగుబోతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తరుణ్ ఆ మేరకు ఎక్సైజ్ అధికారులను కలిసి బీర్ల కొరతపై ఫిర్యాదు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెల్సిందే. మరోవైపు తెలంగాణలో మద్యం, బీర్ల కొరత లేదని స్వయంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ప్రెస్‌మీట్ పెట్టి వివరించడం జరిగింది. త్వరలో కొత్త మద్యం బ్రాండ్‌లను తీసుకొస్తున్నారనే వార్తను ఆయన ఖండించారు. తమకు లేని ఆలోచనను పుట్టిస్తున్నారని అన్నారు. కొత్త ప్రభుత్వంలో ఇప్పటివరకు ఎవరూ కొత్త మద్యం బ్రాండ్ ప్రవేశపెడతామని దరఖాస్తు కూడా చేసుకోలేదని చెప్పారు.