అయిదు రోజుల కిందట పంజాబ్‌లో(Punjab) గ్రామీణ ఒలింపిక్స్(Rural Olympics) ఘనంగా ముగిసాయి. ఒలింపిక్స్ అని ఎందుకంటారంటే ఆ ఆటల పోటీలు కూడా అంత గొప్పగా ఉంటాయి కాబట్టి. అసలు అక్కడ జరిగే గ్రామీణ ఒలింపిక్స్ కిక్కేవేరప్ప! అన్ని మనకు తెలిసిన ఆటలే! ఎక్కువ మట్టుకు మనం చిన్నప్పుడు ఆడినవే! అందుకే వాటిని చూస్తుంటే ఆటోమాటిక్‌గా బాల్యం గుర్తుకొస్తుంది. సంప్రదాయ ఆటపాటలు సరేసరి! కిలారాయ్‌పూర్(Kilaraipur) గ్రామంలో ప్రతీ ఏటా ఈ పోటీలు జరుగుతాయి. ఇందులో పాల్గొనేందుకు క్రీడాకారులు ఎంతో ఉత్సాహం చూపిస్తారు. ఒలింపిక్స్‌లో పాల్గొన్నంతగా సంబరపడతారు. 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగిన క్రీడా పోటీలు జరిగాయి.
అయిదు రోజుల కిందట పంజాబ్‌లో(Punjab) గ్రామీణ ఒలింపిక్స్(Rural Olympics) ఘనంగా ముగిసాయి. ఒలింపిక్స్ అని ఎందుకంటారంటే ఆ ఆటల పోటీలు కూడా అంత గొప్పగా ఉంటాయి కాబట్టి. అసలు అక్కడ జరిగే గ్రామీణ ఒలింపిక్స్ కిక్కేవేరప్ప! అన్ని మనకు తెలిసిన ఆటలే! ఎక్కువ మట్టుకు మనం చిన్నప్పుడు ఆడినవే! అందుకే వాటిని చూస్తుంటే ఆటోమాటిక్‌గా బాల్యం గుర్తుకొస్తుంది. సంప్రదాయ ఆటపాటలు సరేసరి! కిలారాయ్‌పూర్(Kilaraipur) గ్రామంలో ప్రతీ ఏటా ఈ పోటీలు జరుగుతాయి. ఇందులో పాల్గొనేందుకు క్రీడాకారులు ఎంతో ఉత్సాహం చూపిస్తారు. ఒలింపిక్స్‌లో పాల్గొన్నంతగా సంబరపడతారు. 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగిన క్రీడా పోటీలు జరిగాయి. ఈ మూడు రోజులు ఆ గ్రామం జనసందోహంగా మారింది. బాల్య స్మృతులన్నీ కమ్ముకున్నాయి. విశ్వ క్రీడలంత వయస్సు వీటికి లేకపోయినా ఎనిమిది దశాబ్దాల చరిత్ర ఉంది.. 1933లో ఇందర్‌సింగ్ గ్రేవాల్(Indersingh Grewal) అనే సంఘ సేవకుడు కిలా రాయ్‌పూర్ క్రీడోత్సవాలను మొదలు పెట్టారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా ఈ పోటీలు జరుగుతున్నాయి. భారత గ్రామీణ ఒలింపిక్స్‌గా పిలుచుకునే ఈ క్రీడలను ప్రతి ఏడాది ఫిబ్రవరి మొదటి, రెండు వారాల్లో నిర్వహిస్తారు. సుమారు 50 నుంచి 60 సంప్రదాయ క్రీడాంశాలలో పోటీలుంటాయి.
పంజాబ్ ప్రజలకు వ్యవసాయమే ప్రధాన వృత్తి. పొద్దస్తమానం పంటపొలాల్లో పని చేస్తూ అలసిపోయిన రైతులకు కాసింత వినోదం(Entertainment) కల్పించడం కోసం ఈ క్రీడాపోటీలను ప్రారంభించారు. అందరూ ఒక్క చోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకోవడమే కాదు. హుషారుగా పోటీపడేందుకు కూడా ఈ పోటీలు దోహదపడుతున్నాయి. ఓ పక్కేమో ఎడ్లపందాలు జరుగుతుంటాయి. మరో పక్క జాగిలాల జంపింగ్‌లు, రేసులు జరుగుతుంటాయి. ఇంకోపక్కేమో అశ్వక్రీడలు(Horse ridings). వేటిని చూడాలోనన్న సందిగ్ధంలో నాలుగు అడుగులు ముందుకేస్తే సాహసికులు(Stunts) చేసే అద్భుత విన్యాసాలు . ఒక్కమాటలో చెప్పాలంటే అక్కడికి వెళితే ఓ పట్టాన వెనక్కి రాబుద్ధేయదంటే నమ్మండి! నూనూగు మీసాల యువకులే కాదు. వెండిరంగులో మెరిసిపోతున్న మీసాల మామయ్యలు కూడా తమ ప్రతిభను ప్రదర్శించారు. అన్నింటికంటే ఆకర్షణీయమైనవి ఎడ్ల పందాలు. చూపు తిప్పుకోలేనంత గొప్పగా ఉంటాయి. ఇందులో విజయం సాధించినవారికి ఉత్తి ప్రశంసలే కాదు.లక్షల రూపాయల్లో నజరానాలు కూడా అందాయి. ట్రాక్టర్ల పోటీలు కూడా యమరంజుగా ఉన్నాయి.
ఇక గ్రామీణ క్రీడలైన కబడ్డీ, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్ వంటివే కాకుండా అథ్లెటిక్స్.. హాకీ(Hockey), ఫుట్‌బాల్(Football), వాలీబాల్, సైక్లింగ్(Cycling), హ్యాండ్‌బాల్ వంటి మోడ్రన్ ఆటల పోటీలు కూడా ఇక్కడ జరిగాయి. పళ్లతో సైకిళ్లను ఎత్తే మొనగాళ్లు, తలవెంట్రుకలతో ట్రాక్టర్‌లను లాగే బలవంతులు, కాళ్లపై నుంచి ట్రాక్టర్‌ను నడిపించుకునే సాహసవంతులు, మండుతున్న రింగుల్లోంచి సైకిల్‌ను నడిపే చిచ్చరపిడుగుళ్లు ఇక్కడ కనిపించారు. తమతమ అద్భుత విన్యాసాలతో కనువిందు చేశారు.
సాయంత్రాలు బోల్డన్ని వినోద కార్యక్రమాలు జరిగాయి. సంప్రదాయ నృత్యాలు, జానపద పాటలు కాలక్షేపాన్ని అందించాయి.
మొదట్లో చుట్టుపక్కల గ్రామాలే ఈ క్రీడోత్సవాల్లో పాల్గొనేవి! తర్వాతతర్వాత ఇతర జిల్లాల నుంచి కూడా క్రీడాకారులు రావడం మొదలు పెట్టారు. ఇప్పుడు విదేశీ జట్లు కూడా పాల్గొనే రేంజ్‌కు ఈ గ్రామీణ ఒలింపిక్స్ చేరుకున్నాయి. ఇప్పుడు వేలాది మంది పోటీదారులు, లక్షల సంఖ్యలో ప్రేక్షకులు. మూడు రోజులు జన జాతరే! అప్పట్లో ఈ క్రీడాసంబరంలో దేశానికి చెందిన అత్యుత్తమ క్రీడాకారులు కూడా పాల్గొన్నారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌తో పాటు బల్బీర్‌సింగ్...పర్గత్‌సింగ్‌లు కూడా తమ విన్యాసాలను ప్రదర్శించి ప్రేక్షకులకు ఆనందాన్ని పంచారు. చాన్నాళ్లుగా గ్రేవాల్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఈ క్రీడలను నిర్వహిస్తూ వస్తోంది.. వీటి ద్వారా వచ్చే ఆదాయంతో హాకీ అకాడమీని నిర్వహిస్తోంది.. ఈ హాకీ అకాడమీలో దాదాపు 150 మంది క్రీడాకారులు శిక్షణ తీసుకుంటున్నారు