కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)కి లేఖ రాశారు. దేశంలో 2021 దశాబ్దపు జనాభా గణనను త్వరగా నిర్వహించాలని కాంగ్రెస్ నాయకుడు ఖర్గే ప్రధానిని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)కి లేఖ రాశారు. దేశంలో 2021 దశాబ్దపు జనాభా గణనను త్వరగా నిర్వహించాలని కాంగ్రెస్ నాయకుడు ఖర్గే ప్రధానిని డిమాండ్ చేశారు. జనాభా గణనలో కులాన్ని అంతర్భాగంగా చేయాలని అన్నారు. కుల ప్రాతిపదికన జనాభా గణన(Caste Census) నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు తన లేఖలో ప్రధానిని కోరారు. దీనివల్ల సామాజిక న్యాయం, సాధికారత పటిష్టం అవుతుందన్నారు.
కుల ప్రాతిపదికన జనాభా గణనను చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ(Congress Party) నాయకుల తరపున నేను లేఖ రాస్తున్నాను. పార్లమెంటు ఉభయ సభల్లో నేను, నా సహచరులు ఈ డిమాండ్‌ను చాలాసార్లు లేవనెత్తామని ఆయన అన్నారు. మరికొందరు ప్రతిపక్ష నేతలు కూడా ఇదే డిమాండ్ చేశారని ఖర్గే చెప్పారు. ప్రధాని మోదీకి ఖర్గే రాసిన లేఖను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్(Jairam Ramesh) ట్వీట్‌లో పంచుకున్నారు. జనాభా ప్రకారం అందరికీ సమాన హక్కులు రావాలన్నారు. కుల ప్రాతిపదికన జనాభా గణనను కాంగ్రెస్ గతంలో చాలాసార్లు డిమాండ్ చేసిందని పేర్కొన్నారు.
బీహార్(Bihar)లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar) ఇప్పటికే కుల ప్రాతిపదికన జనాభా గణనను ప్రకటించారు. దీన్ని రెండు దశల్లో చేస్తామని ప్రకటించగా, ఇప్పటికే మొదటి దశ పూర్తయింది. రెండో దశ జనాభా గణన ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకై కులాలకు కోడ్‌లను కూడా జారీ చేశారు. ఒక్కో కులానికి ఒక్కో కోడ్ ఇచ్చారు.