పశ్చిమ బెంగాల్(West Bengal)లో రాజకీయ పార్టీల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రచార హోరు పెరిగింది. నాయకుల జోరూ పెరిగింది. లేటెస్ట్‌గా ఓ బీజేపీ అభ్యర్థి నిర్వహించిన ప్రచారం కాస్త వివాదంలో చిక్కుకుంది. నార్త్ మల్దా నియోజకవర్గం(north malda constituency) నుంచి బీజేపీ(BJP) తరఫున పోటీ చేస్తున్నారు సిట్టింగ్ ఎంపీ ఖగేల్ ముర్ము(Khagen Murmu). నియోజకవర్గ పరిధిలో ఇటీవల ఇంటింటా ప్రచారం చేశారు.
పశ్చిమ బెంగాల్(West Bengal)లో రాజకీయ పార్టీల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రచార హోరు పెరిగింది. నాయకుల జోరూ పెరిగింది. లేటెస్ట్‌గా ఓ బీజేపీ అభ్యర్థి నిర్వహించిన ప్రచారం కాస్త వివాదంలో చిక్కుకుంది. నార్త్ మల్దా నియోజకవర్గం(north malda constituency) నుంచి బీజేపీ(BJP) తరఫున పోటీ చేస్తున్నారు సిట్టింగ్ ఎంపీ ఖగేల్ ముర్ము(Khagen Murmu). నియోజకవర్గ పరిధిలో ఇటీవల ఇంటింటా ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఓ యువతి చెంపపై ముద్దు పెట్టాడు ఖగేన్. చంచల్ శ్రిహిపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన సెన్సేషన్ అయ్యింది. యువతికి ఖగేన్ ముర్ము ముద్దు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సహజంగానే ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. దొరికిందే ఛాన్స్ అని అనుకున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విరుచుకుపడింది. కాషాయ పార్టీలో రాజకీయ నాయకులందరూ మహిళా వ్యతిరేకులేనని విమర్శించింది. ‘బీజేపీ ఎంపీ బెంగాల్‌లోని ఉత్తర మాల్దా అభ్యర్ధి ఖగేన్ ముర్మూ తన ప్రచారంలో ఓ మహిళకు ముద్దు పెట్టారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించే ఎంపీల నుంచి.. బెంగాలీ మహిళలపై అశ్లీల పాటలు రాసేటటువంటి నేతలు.. బీజేపీ శిబిజరంలో మహిళా వ్యతిరేక రాజకీయ నాయకులకు కొదవే లేదు. నారీమణులకు ‘మోదీ పరివార్’ ఇస్తున్న గౌరవం ఇది. ఒకవేళ వారు అధికారంలోకి వస్తే ఇలాంటివి ఇంకెన్ని చేస్తారో ఊహించుకోండి’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అయితే ఖగేన్ ముర్మూ తన చర్యలను సమర్ధించుకున్నారు. ఆమెను తన కుమార్తెలా భావించి, ముద్దు పెట్టినట్లు తెలిపారు. పిల్లలకు ముద్దు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. కుట్రపూరితంగా దీనిపై వివాదం సృష్టిస్తున్నారని విమర్శించారు.