పరమ పవిత్రమైన కేదార్‌నాథ్ క్షేత్రం తలుపులు ఈరోజు అంటే 25 ఏప్రిల్ 2023, మంగళవారం,తెరుచుకున్నాయి . ఉత్తరాఖండ్ (uttarakhand)రాష్ట్రంలోని రుద్ర ప్రయాగ్(rudra pryag) జిల్లాలోని పర్వతాల్లో పరమ శివుడు కేదారేశ్వరుడిగా భక్తులకు దర్శనం ఇస్తాడు.కేదార్‌నాథ్ క్షేత్రం(kedaarnath dham )తలుపులు తెరుచుకోగానే, శివుని దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఉదయం 06.30 గంటలకు మేఘ లగ్న మంత్రోచ్ఛారణలల మధ్య హర హర మహాదేవ్ అంటూ మారుమ్రోగే భక్త ఘోష నడుమ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి .
పరమ పవిత్రమైన కేదార్‌నాథ్ క్షేత్రం తలుపులు ఈరోజు అంటే 25 ఏప్రిల్ 2023, మంగళవారం,తెరుచుకున్నాయి . ఉత్తరాఖండ్ (uttarakhand)రాష్ట్రంలోని రుద్ర ప్రయాగ్(rudra pryag) జిల్లాలోని పర్వతాల్లో పరమ శివుడు కేదారేశ్వరుడిగా భక్తులకు దర్శనం ఇస్తాడు.కేదార్‌నాథ్ క్షేత్రం(kedaarnath dham )తలుపులు తెరుచుకోగానే, శివుని దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఉదయం 06.30 గంటలకు మేఘ లగ్న మంత్రోచ్ఛారణలల మధ్య హర హర మహాదేవ్ అంటూ మారుమ్రోగే భక్త ఘోష నడుమ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి . కేదార్‌నాథ్ క్షేత్రంలో(kedaarnath dham )విపరీతమైన చలి ఉన్నప్పటికీ కేదార్‌నాథ్ దర్శనం కోసం వేలాది మంది భక్తులు అక్కడకు చేరుకున్నారు . క్షేత్ర ప్రధాన అర్చకుడు జగద్గురు రావల్ భీమశంకర్ లింగ్ శివాచార్య ఈ ఆలయ తలుపులు తెరిచారు.
కేదార్‌నాథ్ యాత్ర (kedarnath yatra)దర్శనం కేవలం 6 నెలలు మాత్రమే
పన్నెండు జ్యోతిర్లింగాలలో కేదార్‌నాథ్ జ్యోతిర్లింగం కూడా అతి ప్రాముఖ్యమైనది . దీనితో పాటు పంచ కేదార్ లలో కూడా ఈ క్షేత్రం ఒకటిగా చెప్పబడుతుంది . చలికాలంలో ఉష్ణోగ్రత -1 కంటే తక్కువగా పడిపోవడం వల్ల 6 నెలల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి. తలుపులు మూసే ముందు, పూజారులు ఇక్కడ దీపం వెలిగిస్తారు, అది తలుపులు తెరిచిన 6 నెలల తర్వాత మాత్రమే కొండెక్కుతుంది . ప్రతి సంవత్సరం భైరవున్ని పూజించిన తర్వాతనే ఆలయ తలుపులు తీస్తారు . భైరవుడు ఈ ఆలయ క్షేత్రాన్నిరక్షించే క్షేత్ర పాలకుడు అని నమ్ముతారు .
కేదార్‌నాథ్ క్షేత్రం(kedaarnath dham) కథ
మహాభారత యుద్ధం తరువాత, పాండవుల సోదరులు వారి బంధువులను చంపారని ఆరోపించబడతారు . ఈ పాపం నుండి బయటపడటానికి, సోదరులందరూ శివుని వేడుకొని క్షమాపణ కోరడానికి కైలాసానికి చేరుకుంటారు . కానీ శివుడు వారిని క్షమించాలని అనుకోడు . అప్పుడు శివుడు ఎద్దు రూపాన్ని ధరించి పర్వతాలలో పశువుల మధ్య దాక్కుంటాడు .
పాండవులు శివుడిని గుర్తించలేకపోతారు , కానీ భీముడు ఎద్దు రూపం లో ఉన్న శివుడిని గుర్తించి కళ్ళు పట్టుకొని వేడుకొనే భాగం లో ఎద్దు వెనుక భాగం లో ఉన్న తోక పట్టుకొని లాగినట్లు పురాణ కధనం . పాండవుల ఈ భక్తిని చూసిన శివుడు ఎంతో సంతోషించి అందరినీ పాపాల నుండి విముక్తులను చేసాడు. అప్పటి నుండి ఎద్దు వెనుక ఆకారంలో ఉన్న శరీరాన్ని ఇక్కడ శివుని రూపంలో పూజిస్తారు.