కేరళ(Kerala) మావెలిక్కర(Mavelikkara) జిల్లా అదనపు సెషన్స్ కోర్టు(Court) సంచలన తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం నిషేధానికి గురైన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) అనుబంధ సంస్థ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ)కు చెందిన 15 మంది కార్యకర్తలకు మరణశిక్ష విధించింది.
కేరళ(Kerala) మావెలిక్కర(Mavelikkara) జిల్లా అదనపు సెషన్స్ కోర్టు(Court) సంచలన తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం నిషేధానికి గురైన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) అనుబంధ సంస్థ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ)కు చెందిన 15 మంది కార్యకర్తలకు మరణశిక్ష విధించింది. 2021లో కేరళ బీజేపీ(BJP) నేత రంజిత్ శ్రీనివాసన్(Ranjeeth srinivas) హత్య కేసులో కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. మావెలిక్కర జిల్లా అదనపు జడ్జి జస్టిస్ వి.జి. శ్రీదేవి ఈ శిక్షను ఖరారు చేశారు. బీజేపీ నాయకుడు, అడ్వొకెట్ అయిన రంజిత్ శ్రీనివాసన్‌ను ఎస్‌డీపీఐ కార్యకర్తలు హత్య చేసినట్టు కోర్టు నిర్ధారించింది. శ్రీనివాసన్‌పై ఆయన ఇంటి సభ్యుల ముందే దారుణంగా దాడి చేసినట్లు రుజువయ్యింది. అలప్పుజాకు తిరిగి వస్తున్న క్రమంలో శ్రీనివాసన్‌ను 2021, డిసెంబర్ 18వ తేదీ అర్ధరాత్రి దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు పాల్పడిన నైసమ్, అజ్మల్, అనూప్, మొహమ్మద్ అస్లామ్, అబ్దుల్ కలామ్ అలియాస సలమ్, అబ్దుల్ కలామ్, షఫ్రుద్దీన్, మన్షాద్, జసీబ్ రాజా, నవాస్, సమీర్, నాజిర్, జాకిర్ హుస్సేన్, షాజీ పూవతుంగల్, షెర్నాస్ అష్రఫ్‌లకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది