కేరళలో(Kerala) చిప్‌మక్ చీక్స్ వ్యాధి(Chipmunk Cheeks disease) రోజురోజుకూ ముదురుతోంది. గవదబిళ్లలుగా పిల్చుకునే ఈ వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్క రోజులోనే 190 కేసులు బయటపడటంతో వైద్యశాఖలో ఆందోళన పెరిగింది. మార్చి నెలలోనే 2,505 గవదబిళ్లల కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అధికారులు చెబుతున్నదాని ప్రకారం గత రెండు నెలల్లో మొత్తం 11,467 గవదబిళ్లల కేసులు నమోదయ్యాయి.
కేరళలో(Kerala) చిప్‌మక్ చీక్స్ వ్యాధి(Chipmunk Cheeks disease) రోజురోజుకూ ముదురుతోంది. గవదబిళ్లలుగా పిల్చుకునే ఈ వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్క రోజులోనే 190 కేసులు బయటపడటంతో వైద్యశాఖలో ఆందోళన పెరిగింది. మార్చి నెలలోనే 2,505 గవదబిళ్లల కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అధికారులు చెబుతున్నదాని ప్రకారం గత రెండు నెలల్లో మొత్తం 11,467 గవదబిళ్లల కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి సోకికనప్పుడు జ్వరం(Fever), తలనొప్పి(Headache), అలసట, శరీరనొప్పి, లాలాజల గ్రంధులలో వాపు మొదలైనలక్షణాలు కనిపిస్తాయి. మంప్స్‌గా డాక్టర్లు పిల్చుకునే ఈ వ్యాధి సోకినప్పుడు బాధితుల బుగ్గలు వాచినట్లు కనిపిస్తాయి. కొన్ని సందర్భాలలో ఈ వ్యాధి లక్షణాలు బాధితులలో రెండు మూడు వారాల తర్వాత కనిపిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. పారామిక్సోవైరస్ అనే వైరస్ కారణంగా మంప్స్ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఇది బాధితుని నోటి నుంచి వెలువడే నీటి బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. ఇది అంటు రోగం. ఒక వ్యక్తి నుండి మరొకరికి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. మంప్స్ వ్యాధి సోకిన వారికి మెదడు వాపు వచ్చే ప్రమాదం కూడా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. కరోనా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య అధికారులు చెబుతున్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలని సూచిస్తున్నారు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారికి ఈ వ్యాధి త్వరగా సోకుతుంది.