కేరళలో(Kerala) మరోసారి వెస్ట్ నైల్ వైరస్(West Nile virus) కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు పది కేసులు వెలుగులోకి వచ్చాయి. మలప్పురం జిల్లాలో అయిదు కేసులు, కోజికోడ్ జిల్లాలో అయిదు కేసులు నమోదయ్యాయి.
కేరళలో(Kerala) మరోసారి వెస్ట్ నైల్ వైరస్(West Nile virus) కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు పది కేసులు వెలుగులోకి వచ్చాయి. మలప్పురం జిల్లాలో అయిదు కేసులు, కోజికోడ్ జిల్లాలో అయిదు కేసులు నమోదయ్యాయి. వెస్ట్ నైల్ వైరస్ సోకిన పది మందిలో తొమ్మిది మంది కోలుకున్నారు కానీ ఒకరు మాత్రం ఇంకా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఇటీవల సంభవించిన ఇద్దరి మరణాలకు వెస్ట్ నైల్ వైరస్ కారణం కావచ్చని డాక్టర్లు అనుమానిస్ఉన్నారు. అయితే ఇందులో నిజానిజాలను తెలుసుకోవానికి సాంపుల్స్‌ను ల్యాబ్‌కు పంపారు. ఎన్‌సెఫలైటిస్ ఫ్లావి వైరస్ రకానికి చెందిన వెస్ట్ నైల్ వైరస్ దోమల నుంచి మనుషులకు సోకుతుంది. మనుషుల నుంచి మనుషులకు సంక్రమించదు. ఈ వైరస్ సోకిన పది మందిలో ఇద్దరికి మాత్రమే ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయి. కేరళలో 2019,2022 వెస్ట్ నైల్ వైరస్ సోకి ఇద్దరు వ్యక్తులు చనిపోయారు.