ఎన్ని చట్టాలు వచ్చినా, ఎవరెంతగా చెబుతున్నా సమాజంలో కట్నం జాడ్యం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. మగవాళ్ల మెదళ్లలో తిష్టవేసిన కట్న పిశాచి వదలడం లేదు. కేరళ(Kerala)లో ఓ నిండుప్రాణాన్ని కట్నం బలిగొంది. వరకట్నం కారణంగా పెళ్లి కొడుకు వివాహాన్ని రద్దు చేశాడని ఓ డాక్టర్‌ ఆత్మహత్య చేసుకుంది.

ఎన్ని చట్టాలు వచ్చినా, ఎవరెంతగా చెబుతున్నా సమాజంలో కట్నం జాడ్యం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. మగవాళ్ల మెదళ్లలో తిష్టవేసిన కట్న పిశాచి వదలడం లేదు. కేరళ(Kerala)లో ఓ నిండుప్రాణాన్ని కట్నం బలిగొంది. వరకట్నం కారణంగా పెళ్లి కొడుకు వివాహాన్ని రద్దు చేశాడని ఓ డాక్టర్‌ ఆత్మహత్య చేసుకుంది. కేరళ తిరువనంతపురం మెడికల్‌ కాలేజీలో పీజీ చదువుతున్న షహానా మంగళవారం ఉదయం ఇన్‌స్టిట్యూట్‌ దగ్గరలో ఉన్న అద్దె అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించింది. 26 ఏళ్ల హషానా తిరువనంతరపురంలో డాక్టర్‌ పీజీ కోర్సు చదువుతోంది. తన స్నేహితుడుతో పెళ్లి కూడా కుదిరింది. అయితే పెళ్లి కొడుకు తరఫువారు భారీ స్థాయిలో కట్నం అడిగారు. షహానా తల్లిదండ్రులు అంత మొత్తంలో కట్నం ఇచ్చుకోలేకపోయారు. దీంతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు వరుడు. ఇది తెలిసి షహానా తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకుంది. షహానా కుటుంబాన్ని కేరళ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ అడ్వకేట్‌ సతీదేవి పరామర్శించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ పోలీసుల నుంచి నివేదిక కోరనుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్‌ను మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ అన్ని బాధ్యతల నుంచి తొలగించింది. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ కూడా సంఘటనపై స్పందించారు. డాక్టర్‌ ఆత్మహత్యపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మహిళా శిశు అభివృద్ధి శాఖను ఆదేశించారు.

Updated On 7 Dec 2023 1:07 AM GMT
Ehatv

Ehatv

Next Story